Share News

ఓపెన్‌ స్కూల్‌ ఫలితాలు...

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:15 PM

ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలి తాలు గురువారం విడుదలైనట్టు డీఈవో కె.వెంకటేశ్వరరావు తెలిపారు.

ఓపెన్‌ స్కూల్‌ ఫలితాలు...

గుజరాతీపేట: ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలి తాలు గురువారం విడుదలైనట్టు డీఈవో కె.వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లాలో టెన్త్‌ పరీక్షలకు 767 మంది హాజరు కాగా 280 (36.51 శాతం) మంది, ఇంటర్‌లో 1705 మందికి గాను 561 (32.90 శాతం)మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. పది ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా 17, ఇంటర్మీడియట్‌లో 23వ స్థానంలో నిలిచిందన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం గుంటూరు జూన్‌ ఒకటవ తేదీ నుంచి నిర్వహించనున్న ఎస్‌ఎస్‌సి, ఇంటర్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు తేదీ ప్రకటించారన్నారు. పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు ఎస్‌ఎస్‌సి సబ్జె క్టుకు రూ.100, ఇంటర్‌ పరీక్ష సబ్జెక్టుకు రూ.150, ప్రాక్టికల్‌ సబ్జెక్టుకు రూ.100 చొప్పున ఈనెల 29 నుంచి మే 4వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. రూ.25 అపరాధ రుసుంతో మే 5, 6వ తేదీల్లో, రూ.50 అపరాధ రుసుంతో 7,8 తేదీల్లో చెల్లించవచ్చని ఆ ప్రకటనలో తెలిపారు.

Updated Date - Apr 25 , 2024 | 11:16 PM