Share News

కొనసాగుతున్న వేసవి శిక్షణ శిబిరాలు

ABN , Publish Date - Jun 03 , 2024 | 11:30 PM

గ్రంథాలయాలు విద్యార్థులు, నిరుద్యోగు లకు వరం లాంటివని గ్రంథాలయాధికారి అనూరాధ అన్నా రు. స్థానిక శాఖా గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాల్లో భాగంగా సోమవారం విద్యార్థులకు వ్యాసరచన పోటీ లు నిర్వహించారు.

కొనసాగుతున్న వేసవి శిక్షణ శిబిరాలు
నందిగాం: క్విజ్‌ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

మెళియాపుట్టి: గ్రంథాలయాలు విద్యార్థులు, నిరుద్యోగు లకు వరం లాంటివని గ్రంథాలయాధికారి అనూరాధ అన్నా రు. స్థానిక శాఖా గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాల్లో భాగంగా సోమవారం విద్యార్థులకు వ్యాసరచన పోటీ లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వేస వి సెలవుల్లో కాలాన్ని వృథా చేసుకోకుండా విద్యార్థులకు అవ సరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచి వాటిని చదివిం చడం జరుగుతోందన్నారు. పిల్లలకు విజ్ఞానాన్ని పెంపొందిం చేందుకు ఈ శిక్షణలు దోహద పడతాయన్నారు. కార్యక్రమం లో మురళి, మణి తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు ఉపయోగం

నరసన్నపేట: వేసవిలో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాలు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని ఎంఈవో ఉప్పాడ శాంతారావు అన్నారు. స్థానిక శాఖా గ్రంథాలయంలో జరుగు తున్న విజ్ఞాన శిబిరాన్ని సోమవారం పరిశీలించారు. పుస్తక పఠనం అలవర్చుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గ్రంథాల యాధికారి చాయారతన్‌ తదితరులు పాల్గొన్నారు.

మేథో పటిమకు పదును

పాతపట్నం: విద్యార్థుల మేథో పటిమకు పదును పెట్టేం దుకు చదరంగం దోహదం చేస్తుందని శాఖా గ్రంథాలయా ధికారి కాళ్ల రాజు అన్నారు. వేసవి శిక్షణా శిబిరంలో భాగంగా సోమవారం చదరంగం, పుస్తక పఠనం పోటీలను నిర్వహిం చారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రిసోర్స్‌ పర్సన్లు గా పి.ఆనందరావు, బి.బెనర్జీ వ్యవహరించారు. కార్యక్రమంలో పలువురు పాఠకులు పాల్గొన్నారు.

విద్యార్థులకు క్విజ్‌ పోటీలు

నందిగాం: నందిగాం శాఖాగ్రంథాలయంలో సోమవారం విద్యార్థులకు క్విజ్‌ పోటీలు నిర్వహించారు. వేసవి విజ్ఞాన శిబి రంలో భాగంగా గ్రంథాలయాధికారి ఎస్‌.ఉదయ్‌కిరణ్‌ ఆధ్వ ర్యంలో ఈ పోటీలు నిర్వహించగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Updated Date - Jun 03 , 2024 | 11:30 PM