Share News

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ABN , Publish Date - Jun 10 , 2024 | 11:40 PM

ఈదుపురం వంతెనపై సోమవారం సా యంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెంద గా, మరొకరికి తీవ్రంగా గాయపడ్డాడు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ఇచ్ఛాపురం: ఈదుపురం వంతెనపై సోమవారం సా యంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెంద గా, మరొకరికి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపి న వివరాల మేరకు.. సన్యాసిపుట్టుగ గ్రామానికి చెందిన నీలాపు సంతోష్‌కుమార్‌ గ్రామం నుంచి ద్విచక్ర వాహనం పై ఇచ్ఛాపురం వస్తుండగా, అదే గ్రామానికి చెందిన నందూరి ఢిల్లేశ్వర్‌ అలియాస్‌ శంకర్‌ (42) ఇచ్ఛాపురం నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై ఎదురెదురుగా వస్తూ ఢీకొన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వీరిద్దరిని చికిత్స నిమిత్తం ఇచ్ఛాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఢిల్లేశ్వర్‌ మృతి చెందగా.. సంతోష్‌కుమార్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం బరంపురం తరలించారు. రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఢిల్లేశ్వర్‌ ఒడిశాలోని పితాతోళి గ్రామంలో ఓ ప్రైవేట్‌ కంపెనీలో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

సముద్రంలో గల్లంతైన వ్యక్తి..

శ్రీకాకుళం క్రైం: స్నేహితులతో కలిసి కుందువానిపేట తీరంలో సముద్ర స్నానానికి వెళ్లి గళ్లంతైన వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేర కు.. అచ్చెన్నపాలెం గ్రామానికి చెందిన అలిగి రాజేష్‌(33) మృతదేహం సోమవారం మధ్యాహ్నం గార మండలం మొగదలపాడు తీరంలో గుర్తించారు. ఆదివారం సాయ త్రం గల్లంతైన రాజేష్‌ కోసం పోలీసులు, మత్స్యకారులు వెతుకులాట సాగించారు. అయితే మొగదలపాడులో ఓ మృతదేహం గుర్తించినట్టు గార పోలీసులకు సమాచా రం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా రాజేష్‌గా గు ర్తించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రి (రిమ్స్‌)కు తరలించి, అనంతరం మృతదేహాన్ని అతడి కుటుంబ సభ్యులకు పోలీసు లు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Updated Date - Jun 10 , 2024 | 11:40 PM