రైలుకింద పడి వృద్ధురాలి మృతి
ABN , Publish Date - Nov 13 , 2024 | 11:50 PM
హరిశ్చంద్రపురం రైల్వే ఫ్లైఓవర్ సమీపంలో రైలు కిందపడి సుమారు 70 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది.

కోటబొమ్మాళి, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): హరిశ్చంద్రపురం రైల్వే ఫ్లైఓవర్ సమీపంలో రైలు కిందపడి సుమారు 70 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఫ్లైఓవర్ సమీపంలో సుమారు కిలోమీటన్నర దూరంలో వృద్ధురాలు కర్రసాయంతో నడుచు కుంటూ వెళ్లి రైలుకింద పడింది. అక్కడకు సమీపంలోనే ఒడిశాకు చెందిన రైల్వే కార్మికులు పనులు చేస్తున్నారు. వారి మధ్యలో నుంచే ఆమె వెళుతున్నప్పుడు వారు తాగేందుకు నీరి చ్చారు. అయితే కొద్ది సేపటికే ఆమె పలాస నుంచి ఆమదాలవలస వైపు వెళుతున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం వారిని కలిచివేసింది. ఉదయం 10గంటల సమయంలో ఆత్మహత్యకు పాల్పడి నప్పటికీ సాయంత్రం వర కు బంధువులు గాని, రైల్వే పోలీసులు గాని రాలేదని అక్కడి వారు చెబు తున్నారు. ఆమె ముక్కుచెవులకు బంగారు ఆభరణాలున్నాయి. పూల చీర ధరించి ఉంది. ఈమెకోటబొమ్మాళి చాకలివీధికి చెందిన వృద్ధురాలిగా భావిస్తున్నారు. ఆత్మ హత్యకు కారణాలు తెలియరాలేదు. గ్యాంగ్‌మన్ రైల్వేశాఖ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. పలాస జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి ..
కంచిలి, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): జలంత్రకోట కూడలి వద్ద హైవేపై మంగళవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. పోలీ సులు తెలిపిన వివరాల మేరకు.. సోంపేట మండలం పాలవలస పంచాయతీ కుమ్మరిపాడు గ్రామానికి చెందిన కాళ్ల శ్యామ్‌సుందర్(35) కంచిలి మండలం గొల్లపుట్టుగ గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుడు వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబ పోషణ చేసుకుంటున్నాడు. మృతుడికి భార్య త్రివేణి, ఐదేళ్ల కుమార్తె హాన్సిత ఉన్నారు. త్రివేణి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ జి.రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని సోంపేట కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించి పోస్టు మార్టం నిర్వహించారు.