Share News

పాత పింఛన్‌ అమలు చేయాలి

ABN , Publish Date - Jan 09 , 2024 | 12:01 AM

రైల్వేశాఖలో కొత్తగా నియమిస్తున్న ఉద్యోగులకు పాత పింఛన్‌ విధా నాన్నే అమలు చేయాలని శ్రామిక్‌ యూనియన్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం పలాస రైల్వే స్టేషన్‌ ఆవరణలో ఆ సంఘం ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్‌ జనరల్‌ సెక్రటరీ మట్ట రామ కృష్ణ, బ్రాంచ్‌ అధ్యక్షుడు పీవీవీఎన్‌ రావు, ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కొత్త పింఛన్‌ వల్ల ఉద్యోగులు అన్ని విధాలా నష్టపోతారని తెలిపా రు.ఆలిండియా రైల్వే ఫెడరేషన్‌ నేతృత్వంలో గత ఏడాది నుంచి దశలవారీగా ఉద్యమాలు జరుగుతున్నా రైల్వేశాఖ అధికారులు స్పందించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. రైల్వేశాఖ దిగివచ్చి పాత పింఛన్‌ పునరుద్ధరించేంతవరకూ పోరా టం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బి.గాంధీ, కామేశ్వరరావు, ఎండీవీ రమణ, ఎల్‌.వెంకటరావు, ప్రవీణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

 పాత పింఛన్‌ అమలు చేయాలి
పలాస రైల్వేస్టేషన్‌ వద్ద ధర్నా చేస్తున్న శ్రామిక్‌యూనియన్‌ నాయకులు:

పలాస: రైల్వేశాఖలో కొత్తగా నియమిస్తున్న ఉద్యోగులకు పాత పింఛన్‌ విధా నాన్నే అమలు చేయాలని శ్రామిక్‌ యూనియన్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం పలాస రైల్వే స్టేషన్‌ ఆవరణలో ఆ సంఘం ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్‌ జనరల్‌ సెక్రటరీ మట్ట రామ కృష్ణ, బ్రాంచ్‌ అధ్యక్షుడు పీవీవీఎన్‌ రావు, ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కొత్త పింఛన్‌ వల్ల ఉద్యోగులు అన్ని విధాలా నష్టపోతారని తెలిపా రు.ఆలిండియా రైల్వే ఫెడరేషన్‌ నేతృత్వంలో గత ఏడాది నుంచి దశలవారీగా ఉద్యమాలు జరుగుతున్నా రైల్వేశాఖ అధికారులు స్పందించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. రైల్వేశాఖ దిగివచ్చి పాత పింఛన్‌ పునరుద్ధరించేంతవరకూ పోరా టం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బి.గాంధీ, కామేశ్వరరావు, ఎండీవీ రమణ, ఎల్‌.వెంకటరావు, ప్రవీణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2024 | 12:02 AM