అధికారులు బాధ్యతగా పనిచేయాలి
ABN , Publish Date - Mar 06 , 2024 | 11:51 PM
ఎన్నికల నిర్వహణలో సెక్టోరియల్ అధికా రులు బాధ్యతగా పనిచేయాలని, ఎన్నికల కమిషన్ సూచనలు తప్పకుండా పాటించాలని కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ అన్నారు. బుధవారం జడ్పీ సమావేశ మందిరంలో సెక్టోరియల్ అధికారులు, పోలీస్ అధికారు లకు శిక్షణ తరగతులు నిర్వహించారు.

- కలెక్టర్ మన్‌జీర్ జిలానీ సమూన్
అరసవల్లి, మార్చి 6: ఎన్నికల నిర్వహణలో సెక్టోరియల్ అధికా రులు బాధ్యతగా పనిచేయాలని, ఎన్నికల కమిషన్ సూచనలు తప్పకుండా పాటించాలని కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ అన్నారు. బుధవారం జడ్పీ సమావేశ మందిరంలో సెక్టోరియల్ అధికారులు, పోలీస్ అధికారు లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ.. అధికారులు తమ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలు, రూట్లపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఎస్పీ జీఆర్.రాధిక మాట్లా డుతూ.. సమస్యాత్మక, సంక్లిష్ట పోలింగ్ కేం ద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పోలీసులు సెక్టార్ అధికారులతో కలిసి ప్రతీ గ్రామాన్ని సందర్శించాలని సూచించారు. జేసీ ఎం.నవీన్ మాట్లాడుతూ.. సెక్టోరియల్ అధికారులు పోలింగ్ రోజున అన్ని పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన రిపోర్టులను ఎన్నికల కంట్రోల్ రూమ్‌కు అందజేయాలన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో సహాయ కలెక్టర్ రాఘవేంద్ర, డీఆర్వో ఎం.గణపతిరావు, నోడ ల్ అధికారి బాలాజీనాయుడు, మాస్టర్ ట్రైనర్ శేషగిరి, డీఎస్పీ త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు.