Share News

అధికారులే కీలకం

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:15 PM

ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడంలో అధికారులదే పాత్ర కీలకం. గ్రామ స్థాయి నుంచి మొదలుకుని జిల్లాస్థాయి వరకు అధికారులు తమ పాత్ర పోషిస్తారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రధాన ఎన్నికల అధికారి(ఛీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారి)ని సంప్రదిస్తుంది. ఆ అధికారి పర్యవేక్షణలోనే ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణలో జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిలో పనిచేసే అధికారుల వివరాలు..

అధికారులే కీలకం

(హిరమండలం)

ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడంలో అధికారులదే పాత్ర కీలకం. గ్రామ స్థాయి నుంచి మొదలుకుని జిల్లాస్థాయి వరకు అధికారులు తమ పాత్ర పోషిస్తారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రధాన ఎన్నికల అధికారి(ఛీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారి)ని సంప్రదిస్తుంది. ఆ అధికారి పర్యవేక్షణలోనే ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణలో జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిలో పనిచేసే అధికారుల వివరాలు..

జిల్లా ఎన్నికల అధికారి:

ప్రధాన ఎన్నికల అధికారి పర్యవేక్షణలో ప్రతి జిల్లా ఎన్నికల అధికారి ఉంటారు. పాలనాధికారే(కలెక్టర్‌) ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమలు చేయడంలో కలెక్టర్‌ ప్రధాన పాత్ర పోషిస్తారు. ఉన్నతాధికారుల ఆదేశాలను అమలుచేస్తారు.

రిటర్నింగ్‌ అధికారి(ఆర్వో)

ఎన్నికల నిర్వహణకు కేంద్రం రిటర్నింగ్‌ అధికారిని నియ మిస్తుంది. ఈ అధికారి సంబంధిత నియోజకవర్గాలను పర్యవేక్షిస్తారు. నామినేషన్‌ ప్రక్రియ, తుది జాబితా ప్రకటన, పోలింగ్‌ కేంద్రాల్లో విధులు నిర్వహించడానికి సిబ్బంది నియామకం, వారికి అవస రమైన శిక్షణ ఇవ్వడం, ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి వంటి అంశాలు ఆర్వో పర్యవేక్షణలోనే జరుగుతాయి. ఆర్డీవోకు ఈ బాధ్యతలను అప్పగిస్తారు.

సెక్టోరల్‌ అధికారి

ఎనిమిది నుంచి పది పోలింగ్‌ కేంద్రాలను పర్యవేక్షించడానికి సెక్టోరల్‌ అధికారిని నియమిస్తారు. ఆయా బూత్‌ల్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. అవసరమైతే పరిస్థితులకు అనుగుణంగా ఆయా చోట్ల 144 సెక్షన్‌ విధించే అధికారం ఆయనకే ఉంటుంది.

ఓటర్ల నమోదు అధికారి

ఓటర్ల నమోదు అధికారి(ఈఆర్వో, ఏఈఆర్వో) ప్రతి నియో జకవర్గ స్థాయిలో ఉంటారు. కొత్తగా ఓటు నమోదు చేసుకునే వారు, జాబితాలో పేర్లు, ఫొటోలు తప్పుగా ఉన్న వారంతా ఆయన్ను సంప్రదించాలి. ఈఆర్వో, ఏఈఆర్వో పర్యవేక్షణలో సిబ్బంది ఓటర్ల జాబితాను తయారుచేస్తారు.

ప్రిసైడింగ్‌ అధికారి(పీవో)

ప్రతి పోలింగ్‌ కేంద్రానికి ప్రిసైడింగ్‌ అధికారి ఉంటారు. ఈవీ ఎంలు, వీవీ ప్యాట్‌లు బూత్‌లకు తీసుకొచ్చి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించి తిరిగి వాటిని స్ర్టాంగ్‌రూముకు చేర్చేవరకు పీవోదే బాధ్యత. వీరితో పాటు సహాయ ప్రిసైడింగ్‌ అధికారులు ఉంటారు. పోలింగ్‌కేంద్రాల్లో అన్ని కార్యకలాపాలు పీవో పర్యవేక్షణలోనే జరగుతాయి.

సూక్ష్మ పరిశీలకులు

ఎన్నికలు జరిగిన తీరు, పర్యవేక్షణపై నివేదిక రూపొందించి కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపించడానికి సూక్ష్మ పరిశీలకులను ఏర్పాటుచేస్తారు. ప్రతి మండలానికి ఒకరు మాత్రమే ఉంటారు. వీరంతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తారు.

బూత్‌ లెవల్‌ అధికారి(బీఎల్వో)

ప్రతి కేంద్రానికి బూత్‌ లెవల్‌ అధికారి ఉంటారు. కొత్తగా ఓటరు జాబితాలో చేరే వారికి ఫారం-6, తొలగింపునకు ఫారం-7, తప్పుల సవరణకు అవసరమైన ఫారాలు ఇవ్వడం, అర్హులైన వారంతా ఓటు నమోదు చేసుకునేలా చూడడం, పోలింగ్‌ కేంద్రాల్లో సౌకర్యాల కల్పనకు ప్రతిపాదించడం, ఓటర్ల జాబితా ప్రదర్శన, కేంద్రాల మార్పునకు బీఎల్వోలు పనిచేస్తుంటారు. వీరిలో వీఆర్‌ ఏలు, కారోబార్లు, అంగన్‌వాడీ టిచర్లు ఉంటారు.

పోలింగ్‌ ఏజెంట్లు

అభ్యర్థులు పోలింగ్‌ రోజున ప్రతి కేంద్రానికి వెళ్లి నేరుగా పరి శీలించలేరు. అందు వల్ల వారి తరపున ఒక ఏజెంట్‌ను నియమించుకోవచ్చు. పోలింగ్‌ ఏజెంట్‌ ఆ కేంద్రంలో ఓటరుగా ఉండాలి. పోటీలో ఎంత మంది బరిలో ఉంటే అంత మంది ఏజెంట్లను నియమించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి.

Updated Date - Apr 25 , 2024 | 11:15 PM