Share News

గ్రామదేవతకు ముర్రాటల సమర్పణ

ABN , Publish Date - May 26 , 2024 | 11:31 PM

లక్ష్మీనర్సుపేటలో జరుగు తున్న గ్రామదేవత బంగా రు సంతోషిమాత ఉత్స వాల్లో భాగంగా ఆదివారం గ్రామంలోని మహిళలంతా అమ్మవారికి ముర్రాటలు సమర్పిం చారు.

గ్రామదేవతకు ముర్రాటల సమర్పణ
ఎల్‌ఎన్‌పేట: కలశాలతో వెళుతున్న మహిళలు

ఎల్‌.ఎన్‌.పేట: లక్ష్మీనర్సుపేటలో జరుగు తున్న గ్రామదేవత బంగా రు సంతోషిమాత ఉత్స వాల్లో భాగంగా ఆదివారం గ్రామంలోని మహిళలంతా అమ్మవారికి ముర్రాటలు సమర్పిం చారు. ఉదయాన్నే మహిళలంతా ఉపవాసా లుండి కలశాలతో మంగళ వాయిద్యాల నడుమ ఊరే గింపుగా బయలుదేరి ఆల యానికి చేరుకుని అమ్మవారికి చల్లదనం చేసి మొక్కులు చెల్లిం చుకున్నారు. అన్ని వీధుల నుంచి భక్తులు ఊరేగింపులుగా రావడంతో గ్రామంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.

ఘనంగా ఆలయ వార్షికోత్సవం

మందస: మందస గ్రామదేవత అన్నపూర్ణ ఆలయ 14వ వార్షికోత్సవం ఆదివారం నిర్వ హించారు. గ్రామదేవతను దేవాంగ వీధి నుంచి ముర్రాటలు, ఘటాలతో ఊరేగించి ఆలయా నికి తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా భక్తులు చల్లదనం చేసి మొక్కులు తీర్చుకున్నారు.

అంబరాన్ని తాకిన

గ్రామదేవత సంబరాలు

టెక్కలి: జయకృష్ణాపురంలో వేప పోలమ్మతల్లి గ్రామదేవత ఉత్సవాలు ఆది వారం ఘనంగా ప్రారంభమయ్యాయి. దేవర తెచ్చుట, ముర్రాటలు, ప్రత్యేక పూజ లు చేపట్టారు. ఈ నేపథ్యంలో గ్రామంలో వేషధారణలతో పలువురు అలరించారు. దీంతో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. గ్రామం చుట్టాలు, బంధువులతో కళకళ లాడుతోంది. ఈ ఉత్సవం మూడురోజుల పాటు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Updated Date - May 26 , 2024 | 11:31 PM