Share News

ఒడిశా బిల్లు.. ఆంధ్రా ఇసుక

ABN , Publish Date - Sep 01 , 2024 | 12:40 AM

కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టింది.. ఇసుకను యథే చ్ఛగా తరలించుకుపోయేందుకు అన్నట్లుగా కొందరు నేతలు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే నేరుగా ముఖ్యమంత్రి చంద్ర బాబు.. జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో మాట్లాడి అక్రమాలకు పాల్పడవద్దని.. హెచ్చరిస్తూనే ఉన్నారు. కిందిస్థాయి కార్యకర్త లు, నాయకులు సైతం ప్రభుత్వానికి అప్రతిష్ఠ తేవద్దని.. నిజాయితీగా పాలన అందించాలని ఆదేశిస్తూనే ఉన్నారు. కానీ కొంతమంది నాయకులు మాత్రం ఈ విషయాన్ని తమకు వర్తించదు అన్నట్లుగా వదిలేస్తున్నారు.

ఒడిశా బిల్లు.. ఆంధ్రా ఇసుక
గూనభద్ర వద్ద ఇసుక రవాణా కోసం నిలిపిన లారీలు.. రెవెన్యూ, పోలీస్‌ సిబ్బందిని నిలదీస్తున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణ

- లారీ సరుకు కేవలం రూ.30వేలు మాత్రమే

- ప్రభుత్వం హెచ్చరిస్తున్నా.. మారని నేతల తీరు

- అక్రమ తరలింపు గుట్టురట్టు చేసిన జిల్లా టీడీపీ అధ్యక్షుడు

శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి/ కొత్తూరు, ఆగస్టు 31: కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టింది.. ఇసుకను యథే చ్ఛగా తరలించుకుపోయేందుకు అన్నట్లుగా కొందరు నేతలు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే నేరుగా ముఖ్యమంత్రి చంద్ర బాబు.. జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో మాట్లాడి అక్రమాలకు పాల్పడవద్దని.. హెచ్చరిస్తూనే ఉన్నారు. కిందిస్థాయి కార్యకర్త లు, నాయకులు సైతం ప్రభుత్వానికి అప్రతిష్ఠ తేవద్దని.. నిజాయితీగా పాలన అందించాలని ఆదేశిస్తూనే ఉన్నారు. కానీ కొంతమంది నాయకులు మాత్రం ఈ విషయాన్ని తమకు వర్తించదు అన్నట్లుగా వదిలేస్తున్నారు. ముఖ్యంగా నదుల్లో ఇసుకను తరలించేందుకు అనుమతి ఇచ్చేదీ తామే.. తర లించుకుపోయేందుకు ఆదేశాలు ఇచ్చేది తామే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితి పాతపట్నం నియోజకవర్గంలో చోటుచేసుకుంది. ఇక్కడ ఇసుక అక్రమ తవ్వకాలు భాగోతం మరోసారి బయటపడింది. ఒడిశా నుంచి బిల్లుల తీసుకువచ్చి.. దర్జాగా ఇసుకను ఇక్కడ (ఆంధ్రా) నుంచి తరలించుకుపోతు న్నారు. ఎవరి సహకారం లేకుండా.. పక్క రాష్ట్రానికి చెందిన వారు ఇక్కడకు వచ్చి ఇసుకను తరలించుకు పోవడం.. అదీ లారీ ఇసుకను రూ.30వేలకు విక్రయించుకోవడ మంటే.. స్థానిక ప్రజలే కాదు.. ఎవరూ నమ్మేపరిస్థితి లేదు. అయితే కొద్దిరోజులు గా పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం ఆకుల తంపరలో ఇసుకను లారీలతో అక్రమంగా తరలిస్తున్న విషయం టీడీపీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకట రమణకు చేరింది. దర్జాగా ఇసుక తరలించుకు పోతున్నా.. అధి కారులు కూడా అడ్డుచెప్పకపోవడం.. పైగా స్థానికుల ఇంటి నిర్మాణాలకు కాకుండా.. ఒడిశా నుంచి భారీవాహనాలతో తరలిస్తు న్నారంటూ గ్రామస్థులు వివరిం చారు. ఈ నేపథ్యంలో ఇసుక అక్రమ తరలింపుతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని, దీనిపై చర్యలు తీసు కోవాలని జిల్లా అధికారులకు కల మట ఫిర్యాదు చేశారు. దీనిపై స్పం దన లేకపోవడంతో శనివారం వేకువ జామున నేరుగా ఇసుక తరలింపు జరుగుతున్న ప్రాంతం వద్దకు గ్రామస్థులతో కలిసి కలమట వెంకటరమణ వెళ్లారు. శుక్రవారం రాత్రి వంశధార నదిలో నుంచి ఇసుక తవ్వకాలు జరిపి.. లారీల్లో నింపి గూనభద్ర వద్ద నిలిపివేసినట్టు తెలుసుకున్నారు. ఒక్కో లారీకి రూ. 30 వేలు చొప్పున వసూలు చేసి.. ఒడిశా బిల్లులను చూపి కొంద రు ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించారు. అనుమతులు లేకుండా తరలిస్తున్న నాలుగు ఇసుక లారీలను రామకృష్ణపు రం వద్ద గ్రామస్థులు అడ్డుకున్నారు. అధికారుల నిర్లక్ష్యం తీరుపై నిలదీశారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావద్దని.. ఇసుక అక్రమ తవ్వకాలు జరిపితే ఎంతటివారిపైనా ప్రభు త్వానికి ఫిర్యాదు చేస్తామని కలమట హెచ్చరించారు. అక్కడ నుంచే కలెక్టర్‌, ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి.. పాతపట్నం నియోజకవర్గంలో వంశధార నదిలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవా లని.. పటిష్ఠ నిఘా పెంచాలని కోరారు. అలాగే ఇసుకను తరలిస్తున్న లారీలను పోలీసులతో సీజ్‌ చేయించారు. ఈ నేపథ్యంలో ఇసుక అక్ర మ రవాణా జరపకుండా.. ఆకులతంపరలో వంశధార నదికి వెళ్లకుండా అడ్డుగా రెవెన్యూ అధికారులు ట్రెంచ్‌ తవ్వారు. నాలుగు ఇసుక లారీలను కొత్తూరు ఎస్‌ఐ ఎం.ఏ.అహ్మద్‌ సీజ్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.

- ఓండ్రుజోలలో పర్యటించిన పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడుతూ అధికారులు సమన్వ యంతో పనిచేసి ఇసుక అక్రమ రవాణాను నియంత్రించాల ని తెలిపారు. ప్రభుత్వానికి అవినీతి మరక అంటించాలను కుంటే ఉపేక్షించబోమని హెచ్చరించారు. అక్రమ రవాణాకు పాల్పడే వాహనాలను సీజ్‌ చేయాలని సూచించారు.

Updated Date - Sep 01 , 2024 | 12:40 AM