ఎన్టీఆర్ మహనీయుడు
ABN , Publish Date - Jan 18 , 2024 | 11:35 PM
ఎన్టీఆర్ మహనీయుడని పలువురు టీడీపీ నాయకులు కొనియాడారు. తెలుగువారి కీర్తిప్రతిష్టలు దేశవిదేశా లకు చాటిచెప్పిన మహా నాయకుడన్నారు.
పార్వతీపురం ఆంధ్రజ్యోతి: ఎన్టీఆర్ మహనీయుడని పలువురు టీడీపీ నాయకులు కొనియాడారు. తెలుగువారి కీర్తిప్రతిష్టలు దేశవిదేశా లకు చాటిచెప్పిన మహా నాయకుడన్నారు. జిల్లా వ్యాప్తంగా గురువారం ఎన్టీఆర్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. అన్ని నియోజకవర్గాల్లో ఆయన విగ్రహాలకు పూలమాలవేసి నివాళి అర్పించారు. పార్వతీపురంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బోనెల విజయచంద్ర పార్టీ కార్యాల యంలో ఆయన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ తెలుగుజాతికే గర్వకారణమని కొనియాడారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పార్వతీపురం రూరల్‌లో..
పార్వతీపురం రూరల్: మండలంలోని కృష్ణపల్లి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ రెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
కురుపాంలో..
కురుపాం: కురుపాంలో నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి మాజీ మంత్రి శతృచర్ల విజయరామరాజు, కురుపాం నియోజకవర్గ ఇన్‌చార్జి తోయక జగదీశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. శతృచర్ల మాట్లాడుతూ ఎన్టీఆర్‌లాంటి నాయకుడు మళ్లీ పుట్టడని, ఆయన చేపట్లిన సంక్షేమ పథకాలు ఈ రోజుకూ ప్రజలు చెప్పకునేలా ఉన్నాయని అన్నారు. కార్యక్రమంలో తెలుగు యువత అధికార ప్రతినిధి కోలా రంజిత్‌కుమార్, టీడీపీ అరకు పార్లమెంట్ అధికారి ప్రతినిధి డొంకడ రామకృష్ణ, టీడీపీ అరకు పార్లమెంట్ ఎస్‌టీ సెల్ అధికార ప్రతినిధి నందివాడ కృష్ణబాబు, మాజీ సర్పంచ్ కిమిడి రామరాజు, టీడీపీ నాయకులు బీహెచ్‌వీ రమణకుమార్ తదితరులు పాల్గొన్నారు.
సాలూరులో..
సాలూరు: సాలూరులో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గుమ్మిడి సంధ్యారాణి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. డీలక్స్ సెంటర్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు, రొట్టెలు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నిమ్మాది తిరుపతిరావు, పరమేష్, వాడాడ శోభారాణి తదితరులు పాల్గొన్నారు.
పాలకొండలో..
పాలకొండ: పట్టణంలోని కోటదుర్గమ్మ ఆలయం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ పాలకొండ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ క్షీరాభిషేకం చేశారు. జయకృష్ణ మాట్లాడుతూ తెలుగువారి కీర్తిని దేశవిదేశాలకు చాటిచెప్పిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు. కార్యక్రమంలో అరకు పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు పల్లా కొండలరావు, పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు గంటా సంతోష్‌కుమార్, గండి రామినాయుడు, నాయకులు కిమిడి కాశింనాయుడు, వెన్నపు శ్రీను, సుంకరి అనీల్‌దత్ తదితరులు పాల్గొన్నారు.