Share News

ఉపాధి ఉద్యోగులు సమ్మె నోటీసు

ABN , Publish Date - Feb 27 , 2024 | 11:56 PM

ఉపాధి హామీ పథకంలో విధులు నిర్వర్తిస్తున్న టెక్నికల్‌ అసి స్టెంట్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, ఇతర సిబ్బంది తమ డిమాండ్ల సాధన కోసం ఉన్నతాధికారులకు సోమవారం సమ్మె నోటీసులిచ్చారు. జిల్లా సెలక్షన్‌ కమిటీ ద్వారా రిజర్వేషన్‌ పద్ధతిలో ఉద్యోగాల్లో చేరిన తమకు తగిన స్థాయిలో వేతనాలు ఇవ్వకుండాఅన్యాయం చేస్తున్నారని జిల్లా జేఏసీ ఛైర్మన్‌ వైవీ రమణ తెలిపారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా కనీసస్థాయిలో కూడా స్పందన లేదని వాపోయారు.చివరకు సమ్మె ఒక్కటే పరిష్కారమని తెలిపారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్‌, డ్వామా పీడీ, జిల్లాలోని అన్ని మండలాల అభివృద్ధి అధికా రులకు సమ్మె నోటీసులిచ్చాని, వారంరోజుల్లోగా తమ సమస్యలు పరిష్కరించక పోతే సమ్మె తప్ప వేరే మార్గం లేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో రత్నాకర్‌, బీవీ రమణమూర్తి, వెంకటరమణ, అరుణ, సుబ్రహ్మణ్యం, రామకృష్ణ పాల్గొన్నారు.

 ఉపాధి ఉద్యోగులు సమ్మె నోటీసు

అరసవల్లి: ఉపాధి హామీ పథకంలో విధులు నిర్వర్తిస్తున్న టెక్నికల్‌ అసి స్టెంట్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, ఇతర సిబ్బంది తమ డిమాండ్ల సాధన కోసం ఉన్నతాధికారులకు సోమవారం సమ్మె నోటీసులిచ్చారు. జిల్లా సెలక్షన్‌ కమిటీ ద్వారా రిజర్వేషన్‌ పద్ధతిలో ఉద్యోగాల్లో చేరిన తమకు తగిన స్థాయిలో వేతనాలు ఇవ్వకుండాఅన్యాయం చేస్తున్నారని జిల్లా జేఏసీ ఛైర్మన్‌ వైవీ రమణ తెలిపారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా కనీసస్థాయిలో కూడా స్పందన లేదని వాపోయారు.చివరకు సమ్మె ఒక్కటే పరిష్కారమని తెలిపారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్‌, డ్వామా పీడీ, జిల్లాలోని అన్ని మండలాల అభివృద్ధి అధికా రులకు సమ్మె నోటీసులిచ్చాని, వారంరోజుల్లోగా తమ సమస్యలు పరిష్కరించక పోతే సమ్మె తప్ప వేరే మార్గం లేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో రత్నాకర్‌, బీవీ రమణమూర్తి, వెంకటరమణ, అరుణ, సుబ్రహ్మణ్యం, రామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Feb 27 , 2024 | 11:56 PM