Share News

ఏం చెప్పాలో తెలియక బూతులు మాట్లాడుతున్నారు

ABN , Publish Date - Feb 25 , 2024 | 12:18 AM

గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి ఏమిటో చెప్పలేక వైసీపీ నాయకులు బూతులు మాట్లాడుతున్నారని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు విమర్శించారు.

ఏం చెప్పాలో తెలియక బూతులు మాట్లాడుతున్నారు
ఎల్‌ఎన్‌పేట: టీడీపీలో చేరిన వారికి కండువాలు వేసి ఆహ్వానిస్తున్న ఎంపీ రామ్మోహన్‌నాయుడు

హిరమండలం: గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి ఏమిటో చెప్పలేక వైసీపీ నాయకులు బూతులు మాట్లాడుతున్నారని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు విమర్శించారు. శని వారం గొట్ట గ్రామంలో రూ.5 లక్షల ఎంపీ నిధులతో నిర్మించిన బస్‌ షెల్టర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు తిడుతున్నారు.. చంద్రబాబుపై దుమ్మెత్తి పోస్తున్నారు. పాతపట్నం నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి చేశారో శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అవినీతి, అక్రమాల్లో కూరుకు పోయిన వైసీపీ ప్రభు త్వాన్ని రానున్న ఎన్నికల్లో సాగనంపాలని కోరారు. మళ్లీ జగన్‌ని ముఖ్యమంత్రిని చేస్తే మీ మూడో బిడ్డనంటూ మీ ఆస్తులను కూడా లాక్కుంటాడన్నారు. రాష్ట్రంలో యువత భవిష్యత్తును ఈ సర్కా రు చీకట్లోకి నెట్టి వేసిందని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించడం ద్వారా రాష్ట్రాభివృద్ధికి దోహదపడాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మూర్తి, జడ్పీటీసీ పి.బుచ్చి బాబు, పార్టీ మండల అధ్యక్షుడు చెట్టు శ్రీనివాసరావు, నేతలు బర్రి సురేష్‌, ఎస్‌.గోవిందరావు, రామారావు, దారపు డిల్లేశ్వరరావు, కె.సింహా చలం తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులకు అధిక ప్రాధాన్యం
చింతలబడవంజ(ఎల్‌.ఎన్‌.పేట):
గ్రామాల్లో అభివృద్ధి పనుల కు అధిక ప్రాధాన్యం ఇచ్చి ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తున్నామని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. చింతలబడవంజ గ్రామ పెద్ద చెరువుకు రూ.4.80 లక్షలు, డొంకలబడవంజ గ్రామ సమీ పంలోని వంశధార నది కుడి ప్రధాన కాలువ కు రూ.3.10 లక్షల ఎంపీ నిధులతో నిర్మించిన మెట్లను శనివారం ప్రారంభించారు. ధనుకువాడ నుంచి మిరి యాపల్లి రోడ్డుకు రూ.9.50 లక్షలతో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజ లతో ఎన్నికైన ప్రజా ప్రతి నిధులకు రాజకీయాలు శాశ్వతం కావని, చేసిన అభివృద్ధి పనులే చిరసా ్థయిగా నిలిచిపోతా యన్నారు. పార్లమెంట్‌ సభ్యుడిగా తనకు సాధ్యమై నంత వరకు అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తున్నా నన్నారు.

ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే పార్టీలో చేరికలు
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పాలనా విధానాలపై ప్రజలు విరక్తి చెంది ఆ పార్టీని వీడి టీడీపీలో చేరు తున్నారని ఎంపీ అన్నారు. డొంకలబడవంజ గ్రామానికి చెందిన పది కుటుంబాలవారు శనివారం వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఈ సంద ర్భంగా ఆయన పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. సీఎం జగన్మో హన్‌రెడ్డి స్వార్థ రాజకీ యాలకు అధిక ప్రాధాన్యతనిచ్చి ప్రజా సంక్షే మా న్ని, రాష్ట్రాభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె గింపేందుకు ఓటర్లు ఎదురుచూస్తున్నార న్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి, టీడీపీ మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎం.మనోహర్‌నాయుడు, కె.చిరంజీవి, సర్పంచ్‌ వి.లక్ష్మి, నాయకులు ఎస్‌.కిషోర్‌ బాబు, సీహెచ్‌ శ్రీనివాస రావు, వి.ఆనందరావు, ఎస్‌.తేజేశ్వరరావు, జి.మోహనరావు, వి.సత్య నారా యణ, గోవిందరావు, బి.బాలకృష్ణ, ఎం.జగదీశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Feb 25 , 2024 | 12:18 AM