స్టేషనరీ లేదు.. సదుపాయాలు లేవు
ABN , Publish Date - Jul 28 , 2024 | 11:24 PM
ఇచ్ఛాపురం మండలంలోని వార్డు, గ్రామ సచివాలయాల్లో స్టేషనరీతోపాటు సదుపాయాలు లేకపోవడంతో సిబ్బంది ఇబ్బందిపడుతు న్నారు.మునిసిపాలిటీ పరిధిలో పది వార్డు, మండలంలో 16 గ్రామ సచివాల యాలు ఉన్నాయి.

ఇచ్ఛాపురం:ఇచ్ఛాపురం మండలంలోని వార్డు, గ్రామ సచివాలయాల్లో స్టేషనరీతోపాటు సదుపాయాలు లేకపోవడంతో సిబ్బంది ఇబ్బందిపడుతు న్నారు.మునిసిపాలిటీ పరిధిలో పది వార్డు, మండలంలో 16 గ్రామ సచివాల యాలు ఉన్నాయి. వీటి పరిధిలో 200.మంది వరకు సిబ్బంది పనిచేస్తున్నారు. ఏడాదిగా కనీసం స్టేషనరీ లేకపోవడంతో నిర్వహణ భారంగా మారుతోందని పలువురు వాపోతున్నారు.దీనికితోడు తరచూ కంప్యూటర్లు, ప్రింటర్లు సాంకే తిక సమస్యలతో పట్టణ ప్రాంతాలకు వెళ్లాల్సివస్తోందని చెబుతున్నారు. పలు సచివాలయాలకు ఇంటర్‌నెట్ సదుపాయం కూడా సరిగ్గాలేదు. కంప్యూటర్లు, ప్రింటర్లుమరమ్మతులను సొంతఖర్చులతో చేయించుకుంటున్నామని పలువు రు సిబ్బంది చెబుతున్నారు.కూటమి ప్రభుత్వంలో దృష్టిసారించి స్టేషనరీ అం దుబాటులోకి తీసుకురావాలని పలువురుకోరుతున్నారు.కాగావార్డు సచివాలయా లకు నిధుల కొరత నెలకొందని మునిసిపల్ కమిషనర్ ఎన్.రమేష్ తెలిపారు.