వర్షాలు లేక.. ఉభాలు సాగక
ABN , Publish Date - Aug 24 , 2024 | 12:01 AM
పలాస మండలంలో గిరిజన, ఉద్దాన ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా ఖరీఫ్ సీజన్‌లో ఆశించిన వర్షాలు లేకపోవడంతో ఉభాలు వేయలేదు. దీనికితోడు అక్క డక్కడ ఉన్న ఎదలు సైతం ఎండిపోతున్నా యి. రెండు వారాలుగా చిరుజల్లులు తప్ప సాగుకు ఉపయో గపడే వర్షం కురవడంలేదని రైతులు వాపోతున్నారు.
పలాస రూరల్: పలాస మండలంలో గిరిజన, ఉద్దాన ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా ఖరీఫ్ సీజన్‌లో ఆశించిన వర్షాలు లేకపోవడంతో ఉభాలు వేయలేదు. దీనికితోడు అక్క డక్కడ ఉన్న ఎదలు సైతం ఎండిపోతున్నా యి. రెండు వారాలుగా చిరుజల్లులు తప్ప సాగుకు ఉపయో గపడే వర్షం కురవడంలేదని రైతులు వాపోతున్నారు. ఆగస్టు మూడోవారం దాటుతున్నా ఖరీఫ్‌లో ఇప్పటివరకు సగటు వర్షపాతం నమోదు కాలేదు.దీనికితోడు వేసవిని తలపించేలా 40డిగ్రీలు దాటుతుండడంతోపాటుజలాశయాల్లో కనీసం నీరు చేరకపోవడంతో గిరిజన, ఉద్దాన ప్రాంతాలతో పాటు కిష్టుపు రం, గరుడఖండిల్లో వరి ఎదలు ఎండిపోతున్నాయి.
చుక్కనీరు లేక..
టెక్కలిపట్నం నుంచి బడగాం వైపు ఉన్న గోపాలసాగరం ఆయకట్టులో కూడా ఏడాది దమ్ములు కాలేదు. టెక్కలి ప ట్నం-సవరపేట, రేగులపాడుల్లో, కమలాపురం, గోపివల్లభాపు రంలోని మెట్ట భూముల్లో ఆకుమడులు సైతం ఎండిపో తున్నాయి. ఉద్దానం ప్రాంతంలోని ఏ ఒక్క చెరువుల్లో చుక్క నీరు లేకపోవడంతో నారు మడులను సైతం రైతులు విడిచి పెట్టారు. ఉద్దానంలో నీటి వసతులు ఉన్న ప్రాంతాల్లో అక్క డక్కడా దమ్ములు చేసినా తడులు కోసం అన్నదాతలు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా లొత్తూరు, దానగొర, సిరిపురం, సవరగోవిందపురం, గట్టూరు, కొఠారిం గితాళభద్ర వంటి ప్రాంతాల్లో రైతులు ఈ ఏడాది ఖరీఫ్ సాగుపై ఆశలు వదిలేశారు. కొద్దిరోజులుగా మేఘాలు, గర్జనలే తప్ప వర్షం కురవడంలేదని రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కరువు ఛాయలు అలముకున్నాయని రైతులు వాపో తున్నారు. ఖరీఫ్‌లో సైతం పంటలు లేకపోవ డంతో హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వలసలే శరణ్యమని చెబుతున్నారు.