Share News

హ్యాపీ న్యూ ఇయర్‌

ABN , Publish Date - Jan 01 , 2024 | 11:42 PM

కొత్త సంవత్సరానికి జిల్లావాసులు ఘన స్వాగతం పలికారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు సంబరాలు చేసుకున్నారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా సోమవారం అధికారులు, ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

హ్యాపీ న్యూ ఇయర్‌
నిమ్మాడలో అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడుకు శుభాకాంక్షలు..

- జిల్లాలో కొత్త సంవత్సర వేడుకల సందడి

శ్రీకాకుళం కల్చరల్‌/ టెక్కలి/ కోటబొమ్మాళి, జనవరి 1 : కొత్త సంవత్సరానికి జిల్లావాసులు ఘన స్వాగతం పలికారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు సంబరాలు చేసుకున్నారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా సోమవారం అధికారులు, ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పలువురు పూలబొకేలు, స్వీట్లు, పండ్లు తీసుకెళ్లి.. శుభాకాంక్షలు తెలిపారు. కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌ నాయుడు కొత్త సంవత్సరం వేడుకలు చేసుకున్నారు. వారికి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీలఠ్కర్‌ను ఎస్పీ రాధిక, డీఎం హెచ్‌వో మీనాక్షి, జడ్పీ సీఈవో వెంకట్రామన్‌, డ్వామా పీడీ చిట్టిరాజు, డీఆర్డీవో పీడీ విద్యాసాగర్‌, డీఈవో వెంకటేశ్వర రావు, ఆర్డీవో రంగయ్య, తహసీల్దార్‌ వెంకటరావు, డీపీవో రవికుమార్‌, డీపీఆర్వో సూర్యచంద్రరావు తదితర అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కొత్త సంవత్సరంలో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ పూజలు చేశారు. శ్రీకాకుళంలోని నారాయణ తిరుమల ఆలయంలో వేంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా అలంకరించగా.. అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. విజయగణపతి ఆలయంలో పూజలు చేశారు. సత్యసాయి మందిరంలో భజనలు, కీర్తనలు ఆలపించారు.

Updated Date - Jan 01 , 2024 | 11:42 PM