Share News

నీట్‌ పరీక్ష పేపర్‌ లీకేజీపై విచారణ చేయాలి

ABN , Publish Date - Jun 09 , 2024 | 11:39 PM

దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో చదివేం దుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహించిన నీట్‌ పరీక్ష ఫలితం, లీకేజీపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేపట్టాలని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ రవి డిమాండ్‌ చేశారు.

నీట్‌ పరీక్ష పేపర్‌ లీకేజీపై విచారణ చేయాలి

కాశీబుగ్గ: దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో చదివేం దుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహించిన నీట్‌ పరీక్ష ఫలితం, లీకేజీపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేపట్టాలని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ రవి డిమాండ్‌ చేశారు. ఆదివారం కాశీబుగ్గలో విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాల్లో ఆరుగురు విద్యార్థులకు 720 మార్కులకు 720 రావడం, వీరంతా ఒకే పరీక్ష సెంటర్‌కి సంబంధించిన వారు కావడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ విడుదల చేసిన ఫలితాలపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే విచారణ చేయించి మెడికల్‌ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వేలాదిమంది ప్రతిభ కలిగిన విద్యా ర్థులు మెడికల్‌ విద్యకు దూరమవుతున్నారన్నారు. సమావేశంలో నాయకులు పవన్‌, జశ్వంత్‌, ధను తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 09 , 2024 | 11:39 PM