Share News

రానున్నది ఎన్డీయే ప్రభుత్వమే: శంకర్‌

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:00 AM

సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి, అధికారంలోకి రానున్నది ఎన్డీయే ప్రభుత్వ మేనని టీడీపీ-జనసేన-బీజేపీ శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్‌ అన్నారు. గురువారం నగరంలోని 28వ డివిజన్‌లో ఇన్‌చార్జి గుత్తు చిన్నారావు ఆధ్వర్యంలో వాంబే కాలనీ, బాదుర్లపేట, కొత్తపేట తదితర ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి సూపర్‌ సిక్స్‌ పథకాలను వివరించారు.

రానున్నది ఎన్డీయే ప్రభుత్వమే: శంకర్‌
అరసవల్లి: ప్రచారం నిర్వహిస్తున్న కూటమి అభ్యర్థి గొండు శంకర్‌ తదితరులు

అరసవల్లి: సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి, అధికారంలోకి రానున్నది ఎన్డీయే ప్రభుత్వ మేనని టీడీపీ-జనసేన-బీజేపీ శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్‌ అన్నారు. గురువారం నగరంలోని 28వ డివిజన్‌లో ఇన్‌చార్జి గుత్తు చిన్నారావు ఆధ్వర్యంలో వాంబే కాలనీ, బాదుర్లపేట, కొత్తపేట తదితర ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి సూపర్‌ సిక్స్‌ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా రామ్మోహన్‌ నాయు డును గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జనసేన ఇన్‌చార్జి కోరాడ సర్వేశ్వరరావు, బీజేపీ రాష్ట్ర కార్య దర్శి శవ్వాన ఉమామహేశ్వరి, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు పిఎంజె.బాబు, కోరాడ హరగోపాల్‌, గంగు పెద్ద రమణ పాల్గొన్నారు.

మఖరజోల, చిన్న నారాయణపురం నుంచి..

హరిపురం: మందస మండలం మఖరజోల (పిడిమందస ప్రాదేశికం) ఎంపీటీసీ సభ్యుడు వావిలపెల్లి మాధవరావు 20 మంది అనుచరులతో గురువారం వైసీపీని వీడి టీడీపీలో చేరారు. నారా యణపురం పంచా యతీ చిననారయణపురంలో వైసీపీ నుంచి సుమారు 50 కుటుంబాలు టీడీపీలో చేరాయి. వీరికి టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు మాట్లాడు తూ గత ఐదేళ్లుగా మందస మండలం అభివృద్ధికి నోచుకోలేదని, మళ్లీ టీడీపీ వస్తే అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ఎమ్మెల్యేగా గౌతు శిరీష, ఎంపీగా రామ్మోహన్‌ నాయుడులను గెలి పించుకుంటామన్నారు. కార్యక్రమంలో నేతలు కొర్ల కన్నారావు, బావన దుర్యోధన, దాసరి తాతారావు, రట్టి లింగరాజు, నవీన్‌, నారా యణ, జీకే నాయుడు తదితరులు పాల్గొన్నారు.

వైసీపీ జిల్లా కోశాధికారి ‘లోతుగెడ్డ’ టీడీపీలో చేరిక

పాతపట్నం/ కొత్తూరు: వైసీపీ జిల్లా కోశాధికారి లోతుగెడ్డ తులసీ వరప్రసాద్‌ తన అనుచరులతో టీడీపీలో చేరారు. గురువారం వీరికి ఎన్డీఏ టీడీపీ అభ్యర్థి మామి డి గోవిందరావు కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తులసీ వరప్రసాద్‌ మాట్లాడుతూ.. వైసీపీ పార్టీకి తొలి నుంచీ సేవలు చేసినం దుకు బహుమతిగా తనను సస్పెండ్‌ చేసిందన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి మామిడి గోవింద రావుకు సంపూర్ణ మద్దతిచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తా మన్నారు. మామిడి గోవిందరావు మాట్లాడుతూ.. పార్టీలో చేరిన తులసీ వరప్రసాద్‌కు ఎల్లవేళలా రుణపడి ఉంటానన్నారు. టీడీపీలో చేరిన వారిలో ఎంపీపీతో పాటు ఇద్దరు వైస్‌ ఎంపీపీలు, 30 మంది సర్పంచ్‌లు ఎంపీటీసీలు, 14 మంది మాజీ సర్పంచ్‌లు ఉన్నారు.

కమలం గుర్తుపై ఓటేసి రుణం తీర్చుకుంటాం

రణస్థలం: సామాజిక కార్య క్రమాలు చేపట్టి, ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్ది, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసిన మీకు కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించుకుంటామని సంచాం గ్రామా నికి చెందిన ప్రజలు ఎన్‌డీఏ కూటమి ఎచ్చెర్ల బీజేపీ అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావుకు హామీ ఇచ్చారు. గురువారం సంచాం పంచాయతీ పరిధిలో చెరువు పనుల వద్ద ఉపాధి వేతనదారులను ఈశ్వరరావు కలిశారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ కమలం గుర్తుపై ఓటేసి తనను ఎమ్మెల్యేగా, సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి కలిశెట్టి అప్పలనాయుడును ఎంపీగా గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కూటమి సభ్యులు లంక ప్రభ, కోరాడ రమణ తదితరులు పాల్గొన్నారు.

ఎన్డీఏ కూటమిలో 110 కుంటుంబాలు చేరిక

మెంటాడ పంచాయతీ పరిధిలోని 110 కుంటుంబాలు మాజీ ఎంపీటీసీ సీరపు పైడియ్యరెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఎన్‌డీఏ కూటమిలో చేరారు. ఎన్‌డీఏ కూటమి అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావు వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు.

Updated Date - Apr 19 , 2024 | 12:00 AM