Share News

సభ్వత్వ నమోదులో మొదటి స్థానం సాధించాలి

ABN , Publish Date - Oct 25 , 2024 | 11:14 PM

తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే పట్టు కొమ్మలని, గడచిన 40 ఏళ్లలో అనేక ఒడిదుడుకులు వచ్చినా చెక్కు చెదరలేదని మంత్రి కింజరాపు అచ్చె న్నాయుడు అన్నారు.

సభ్వత్వ నమోదులో మొదటి స్థానం సాధించాలి
మాట్లాడుతున్న మంత్రి అచ్చెన్నాయుడు

కోటబొమ్మాళి, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే పట్టు కొమ్మలని, గడచిన 40 ఏళ్లలో అనేక ఒడిదుడుకులు వచ్చినా చెక్కు చెదరలేదని మంత్రి కింజరాపు అచ్చె న్నాయుడు అన్నారు. శుక్రవారం స్థానిక ఎన్టీఆర్‌ భవన్‌లో నియోజకవర్గ స్థాయి పార్టీ నేతలు, క్రియాశీలక సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ సభ్యత్వ నమోదును ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీక రించి లక్ష్య సాధనలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానం సాధించాలన్నారు. ఇతర పార్టీల వారు సభ్యత్వాలకు అర్హులు కారన్నారు. ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పార్టీకోసం పనిచేసే వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు. అర్ధరాత్రి ఫోన్‌ చేసినా అందుబాబటులో ఉండాలని నేతలకు సూచించారు. గడచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని, దానిని గాడిలో పెట్టేందుకు 5 నెలల కాలం పట్టిందన్నారు. చంద్రబాబు లాంటి వ్యక్తి సీఎం కావడం వల్లే ఇది సాధ్యపడిందన్నారు. నవంబరు, డిసెంబరుల్లో గ్రామసభల ద్వారా అర్హులను గుర్తించి పింఛన్లు అందించడం జరుగుతుం దన్నారు. నీటి సంఘాల ఎన్ని కలకు సిద్ధంగా ఉండా లని కోరారు. డిసెంబరు నెలా ఖరులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ మాజీ అధ్య క్షుడు కె.హరివర ప్రసాద్‌, టీడీపీ రాష్ట్ర టీడీపీ కార్యదర్శి బోయిన గోవింద రాజులు, నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు పినకాన అజయ్‌కుమార్‌, బగాది శేషు, రమేష్‌, ఽజీరు బీమారావు, నేతలు కర్రి అప్పారావు, ఎల్‌ఎల్‌ నాయుడు, విజయలక్ష్మి, మెండ దమయం తమ్మ, మామిడి రాము తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2024 | 11:14 PM