Share News

ఎన్నికల నియమావళిపై అవగాహన ఉండాలి

ABN , Publish Date - Mar 01 , 2024 | 11:50 PM

రానున్న సార్వత్రిక ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహణకు ఎన్నికల కమిషన్‌ నియమ నిబంధనలు, ప్రవర్తనా నియమావళిపై పూర్తి అవగాహన అవసరమని జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి పీఎస్‌ ఎస్‌.ప్రసన్నలక్ష్మి తెలిపారు. సోమవారం శ్రీకాకుళంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కళావేదికలో సాధారణ ఎన్నికలు- 2024కు సంబంధించి ఈఆర్వోలు, సబ్‌ డివిజనల్‌ పోలీసు అధికారులు, ఫ్లయింగ్‌స్క్వాడ్‌, స్టాటిస్టిక్‌ సర్వెలెన్స్‌, వీడియో సర్వెలెన్స్‌, వీడియో వ్యూయింగ్‌ సిబ్బందికి ఎన్నికలనియమావళి సిబ్బంది, అసెంబ్లీ మాస్టర్‌ ట్రైనర్స్‌ కు శిక్షణ నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలు పారదర్శకం గా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు

 ఎన్నికల నియమావళిపై అవగాహన ఉండాలి

కలెక్టరేట్‌: రానున్న సార్వత్రిక ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహణకు ఎన్నికల కమిషన్‌ నియమ నిబంధనలు, ప్రవర్తనా నియమావళిపై పూర్తి అవగాహన అవసరమని జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి పీఎస్‌ ఎస్‌.ప్రసన్నలక్ష్మి తెలిపారు. సోమవారం శ్రీకాకుళంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కళావేదికలో సాధారణ ఎన్నికలు- 2024కు సంబంధించి ఈఆర్వోలు, సబ్‌ డివిజనల్‌ పోలీసు అధికారులు, ఫ్లయింగ్‌స్క్వాడ్‌, స్టాటిస్టిక్‌ సర్వెలెన్స్‌, వీడియో సర్వెలెన్స్‌, వీడియో వ్యూయింగ్‌ సిబ్బందికి ఎన్నికలనియమావళి సిబ్బంది, అసెంబ్లీ మాస్టర్‌ ట్రైనర్స్‌ కు శిక్షణ నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలు పారదర్శకం గా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రవర్తనా నియమావ ళిని తూచాతప్పకుండా పాటించాలన్నారు.ఫ్లయింగ్‌స్క్వాడ్స్‌ అప్రమత్తంగా ఉండి ఫిర్యాదులపె స్పందించి పరిష్కరించాలన్నారు.కార్యక్ర మంలో జిల్లా వ్యాప్తంగా పోలీసు సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, జిల్లాస్థాయి మాస్టర్‌ ట్రైనర్లు, జడ్పీ డిప్యూటీ సీఈవో వెంకట్రామన్‌, డీఐపీ పీఆర్వో చెన్నకేశవరావు, మోడల్‌ ఆఫీసర్‌ ఎన్‌.బాలాజీ పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 11:50 PM