Share News

ఎంఎస్పీ చేయాలి

ABN , Publish Date - Mar 14 , 2024 | 11:41 PM

తక్షణమే కనీసమద్దతు ధర(ఎంఎస్పీ) చట్టం చేయాలని ప్రజాసంఘా లు, వామపక్షాల డిమాండ్‌చేశాయి. ఈమేరకు గురువారం జిల్లా వ్యాప్తంగా గురువారం కేంద్ర ప్రభుత్వ రైతు,కార్మిక విద్రోహ చర్యలకు వ్యతికంగా ఢిల్లీలో జరుగుతున్న పోరాటానికి మద్దతుగా నిరసన తెలిపాయి.

ఎంఎస్పీ  చేయాలి
అరసవల్లి: శ్రీకాకుళంలో ర్యాలీ నిర్వహిస్తున్న సీఐటీయూ నాయకులు

==========================

తక్షణమే కనీసమద్దతు ధర(ఎంఎస్పీ) చట్టం చేయాలని ప్రజాసంఘా లు, వామపక్షాల డిమాండ్‌చేశాయి. ఈమేరకు గురువారం జిల్లా వ్యాప్తంగా గురువారం కేంద్ర ప్రభుత్వ రైతు,కార్మిక విద్రోహ చర్యలకు వ్యతికంగా ఢిల్లీలో జరుగుతున్న పోరాటానికి మద్దతుగా నిరసన తెలిపాయి.

ఫ నరసన్నపేట: స్వామినాథన్‌ కమిటీ సిపారసుల మేరకు రైతులు పండించే అన్ని పంటలకు మద్దతు ధర కల్పించే చట్టం అమలు చేయాలని ఎస్‌కేఎం, అఖిల భారత రైతుకూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి తాండ్ర ప్రకాశ్‌ డిమాండ్‌ చేశారు. పెద్దకరగాంలో ప్రజాసంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు సన్నశెట్టి రాజశే ఖర్‌, నేతింటి నీలంరాజు పాల్గొన్నారు.

ఫ టెక్కలి: సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు మేరకు రైతుల చలో ఢిల్లీకి మద్దతుగా టెక్కలిలో సీపీఎం, కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వ హించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన హామీలు అమ లు చేయాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ అధ్యక్షులు కోత మధు, పొట్నూరు ఆనందరావు, సాసుమాను ధర్మ, సీపీఎం నాయకులు నంబూరు షణ్ముఖరావు, సీఐటీయూ నాయకులు ఈశ్వరరావు, కొల్లి ఎల్లయ్య, సాంభమూర్తి, దాట్ల లింగమూర్తి, శంకరప్రసాద్‌రెడ్డి, ధనుంజయరావు, బగాది వాసుదేవరావు, గౌరమ్మ పాల్గొన్నారు.

ఫ కాశీబుగ్గ:దేశాన్ని కార్పొరేట్లకు తాకట్టుపెడుతున్న మోదీని గద్దె దింపే వరకూ పోరాటం ఆగదని వామపక్ష నాయకులు గణపతి, వెంకట రమణ, సన్యాసిరావు, మాధవరావు, హేమారావు తెలిపారు. కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద పలాస రైతు,కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరస న తెలిపా రు. కార్యక్రమంలో వామపక్ష నాయకులు భాస్కరరావు, భానమ్మ, భీమారావు శ్రీనివాస్‌,లోకనాధం,శ్యామ్‌సుందరరావు,సాయమ్మ పాల్గొన్నారు.

ఫజి.సిగడాం: కేంద్రప్రభుత్వం కార్మికహక్కలను కాలరాస్తోందని కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెలమల రమణ, సీఐటీయూ జిల్లా అధ్యక్షు డు అమ్మన్నాయుడు ఆరోపించారు. జి.సిగడాంలో కౌలు రైతు, సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సంఫ నాయకులు ఎస్‌.జగ దీశ్వరరావు, రేగాన శివుడు, రెడ్డి గన్నిరాజు, వై.లక్ష్మణరావు పాలొన్నారు.

ఫఅరసవల్లి:కేంద్రప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, రైతు సంఘం జిల్లాకార్యదర్శి కె.మోహనరావు, వ్యవసాయ కార్మికసంఘం జిల్లాప్రధాన కార్యదర్శి జి.సిం హాచలం డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతరేకంగా రైతులు నిర్వహిస్తున్న చలో ఢిల్లీకి మద్దతుగా శ్రీకాకుళంలోని డైమండ్‌ పార్కు నుంచి ఏడురోడ్ల జంక్షన్‌ వరకు ర్యాలీ ని ర్వహించారు. కార్యక్రమంలో సీఐటీయూ పట్టణ కన్వీనర్‌ ఆర్‌.ప్రకాశరావు, కోకన్వీనర్‌ ఎం.గోవర్థన రావు, వివిధ కార్మిక, ప్రజా సంఘాల నాయకు లు పి.చంద్రరావు, ఎన్‌.బలరాం పాల్గొన్నారు.

Updated Date - Mar 14 , 2024 | 11:41 PM