Share News

భగభగలే

ABN , Publish Date - Apr 05 , 2024 | 12:26 AM

పేదల ఊటీగా పేరు గాంచిన శ్రీకాకుళం జిల్లాలో శుక్ర, శనివారాల్లో భానుడు తీవ్ర ప్రతాపం చూపనున్నాడు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ(ఏపీఎస్‌డీఎంఏ) గురువారం సాయంత్రం హెచ్చరిక జారీచేసింది. జిల్లాలో 30 మండలాల్లో శుక్రవారం ఏకంగా 24 మండలాల్లో తీవ్ర వేడిమి ఉంటుందని.. వడగాల్పులు వీచే అవకాశం అధికంగా ఉందని వెల్లడించింది.

భగభగలే

- నేడు, రేపు అధికంగా ఎండలు

- 24 మండలాల్లో తీవ్ర వడగాల్పులు

- ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే

- హెచ్చరించిన రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ

(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)

పేదల ఊటీగా పేరు గాంచిన శ్రీకాకుళం జిల్లాలో శుక్ర, శనివారాల్లో భానుడు తీవ్ర ప్రతాపం చూపనున్నాడు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ(ఏపీఎస్‌డీఎంఏ) గురువారం సాయంత్రం హెచ్చరిక జారీచేసింది. జిల్లాలో 30 మండలాల్లో శుక్రవారం ఏకంగా 24 మండలాల్లో తీవ్ర వేడిమి ఉంటుందని.. వడగాల్పులు వీచే అవకాశం అధికంగా ఉందని వెల్లడించింది. 4 మండలాల్లో మోస్తరుగా ఎండలు ఉంటాయని.. మరో రెండు మండలాల్లో మాత్రం సాధారణ ఉష్ణోగ్రత నమోదవుతుందని పేర్కొంది. శనివారం 25 మండలాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, తీవ్ర వడగాల్పులు వీచ్చే అవకాశముందని హెచ్చరించింది. 5 మండలాల్లో మోస్తరు ఎండ ఉంటుందని స్పష్టం చేసింది. ఆమదాలవలస, బూర్జ, ఎచ్చెర్ల, జి.సిగడాం, హిరమండలం, ఇచ్ఛాపురం, జలుమూరు, కంచిలి, కవిటి, కోటబొమ్మాళి, కొత్తూరు మండలాల్లో ఈ రెండు రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఎల్‌.ఎన్‌.పేట, లావేరు, మందస, మెళియాపుట్టి, నందిగాం, నరసన్నపేట, పలాస, పాతపట్నం, పోలాకి, పొందూరు, సారవకోట, సరబుజ్జిలి, సోంపేట, శ్రీకాకుళం, టెక్కలి మండలాల్లో కూడా ఎండలు ప్రభావం చూపనున్నాయి. ఆయా మండలాల్లో 43 డిగ్రీల సెంటీగ్రేడ్‌ నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఉష్ణోగ్రతలు ఇలా..

===========================================

మండలం శుక్రవారం శనివారం

===========================================

ఆమదాలవలస 43.6 44.0

బూర్జ 44.5 45.2

ఎచ్చెర్ల 40.2 40.2

జి.సిగడాం 44.1 44.5

గార 38.3 38.5

హిరమండలం 44.5 45.4

ఇచ్ఛాపురం 42.6 41.8

జలుమూరు 43.6 44.2

కంచిలి 43.0 43.0

కవిటి 41.7 41.2

కోటబొమ్మాళి 42.2 42.8

కొత్తూరు 44.4 45.6

ఎల్‌ఎన్‌ పేట 44.5 45.2

లావేరు 41.8 41.9

మందస 41.8 42.2

మెళియాపుట్టి 43.6 44.1

నందిగాం 41.5 42.0

నరసన్నపేట 42.4 42.8

పలాస 41.5 41.9

పాతపట్నం 44.2 45.0

పోలాకి 40.3 40.7

పొందూరు 43.0 43.3

రణస్థలం 40.3 40.0

సంతబొమ్మాళి 38.6 39.1

సారవకోట 44.0 44.6

సరబుజ్జిలి 44.2 44.7

సోంపేట 41.3 41.3

శ్రీకాకుళం 41.1 41.4

టెక్కలి 42.4 43.0

వజ్రపుకొత్తూరు 38.9 39.2

వడదెబ్బకు దివ్యాంగుడు మృతి

మెళియాపుట్టి, ఏప్రిల్‌ 4: రట్టిణి గ్రామానికి చెందిన వినోద్‌ పాత్రో(60)అనే దివ్యాంగుడు గురువారం వడదెబ్బ తగిలి మృతిచెందాడు. గురువారం ఉదయం వసుంధర గ్రామంలోని సచివాలయానికి వెళ్లి పింఛన్‌ తీసుకున్నాడు. అనంతరం ఒడిశాలోని సీతాపురం సమీపంలో పొలంలో వడదెబ్బకు గురై మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

Updated Date - Apr 05 , 2024 | 12:26 AM