Share News

నిధుల దుర్వినియోగంపై ఎమ్మెల్యే ఆగ్రహం

ABN , Publish Date - Jul 11 , 2024 | 11:56 PM

వైసీపీ ఐదే ళ్ల పాలనలో మున్సిపాలిటీలో జరి గిన ప్రభుత్వ నిధుల దుర్వినియో గంపై స్థానిక ఎమ్మెల్యే కూన రవి కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిధుల దుర్వినియోగంపై ఎమ్మెల్యే ఆగ్రహం
అధికారులను ప్రశ్నిస్తున్న ఎమ్మెల్యే రవికుమార్‌

- బిక్కమొహం వేసిన మున్సిపల్‌ అధికారులు

- సమీక్షలో కూన రవికుమార్‌ అసహనం

ఆమదాలవలస: వైసీపీ ఐదే ళ్ల పాలనలో మున్సిపాలిటీలో జరి గిన ప్రభుత్వ నిధుల దుర్వినియో గంపై స్థానిక ఎమ్మెల్యే కూన రవి కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం స్థానిక మున్సిపల్‌ కా ర్యాలయంలో అన్ని శాఖల అధికా రులతో ఆయన సమీక్షించారు. ము ఖ్యంగా ఇంజనీరింగ్‌ అధికారులు ఐదేళ్లలో చేపట్టిన చెల్లింపులపై ఆరా తీశారు. ప్రస్తు తం మున్సిపల్‌ ఖాతాలో ఉన్న జనరల్‌ నిధుల ఎంత ఉన్నాయని ఎమ్మెల్యే ప్రశ్నించగా.. రూ.19.5 లక్షలు మాత్రమే ఉన్నట్టు అకౌంటెంట్‌ సాయిరామ్‌ చెప్పగా పూర్తి వివరాలు తెలపాలని అసహనం వ్యక్తం చేశా రు. 2023-2024 సంవత్సరంలో రూ.3.67 కోట్లు రాబ డి వస్తే.. రూ.ఐదు కోట్లు ఎలా ఖర్చు చేశారని, మిగి లిన రూ.1.33 కోట్లు లోటు మాటేంటని నిలదీశారు. మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఇంటి వద్ద 12 మంది సిబ్బందిని కేటాయించి వారి వ్యక్తిగత పె ట్రోల్‌ బంకు, కాలేజ్‌ కారు డ్రైవర్లుగా విధులు నిర్వ హిస్తే.. వారికి మున్సిపల్‌ ప్రభుత్వం నిధుల నుంచి జీతాలుగా రూ.1.20 కోట్లు ఎలా చెల్లిస్తారని ప్రశ్నిం చడంతో బిక్కమొహం వేసి నిల్చొండిపోయారు. ఇలా వివిధ అంశాలపై ఆరా తీయడంతో సంబంధిత అధి కారులు నీళ్లునమిలారు. మున్సిపల కమిషనర్‌ జి.రవి, డీఈ సుగుణాకర్‌, ఏఈ అప్పలనాయుడు, మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తమ్మినేని గీతా, టీడీపీ నాయకులు చంద్రశేఖర్‌, మురళీధరరావు, అప్పలనా యుడు, భాస్కరరావు పాల్గొన్నారు.

స్థానిక రైతు బజారు వద్ద ఎమ్మెల్యే రవికుమార్‌ కంది పప్పు కౌంటర్‌ను ప్రారంభించారు. మార్కెట్‌ ధర కంటే తక్కువకే ప్రభుత్వం కందిపప్పును అందిస్తుంద న్నారు.

స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో పెన్షన ర్ల సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సురవరపు శిమ్మినాయుడు, బొడ్డేపల్లి జనార్దనరావు ఆధ్వర్యంలో సంఘ నాయకులంతా ఎమ్మెల్యే కూన రవికుమార్‌ ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సంఘ గౌరవాధ్యక్షుడు బొడ్డేపల్లి మోహన్‌రావు, కోశాధికారి హెచ్‌వీ సత్యనారాయణ, ఉపాఽధ్యక్షుడు ధాస్యం లక్ష్మ ణరావు, కె.షన్ముఖరావు, ఎన్‌.చంద్రశేఖరరావు, బీవీ రమణ, భానోజీరావు, కె.సంజీవరావు పాల్గొన్నారు.

Updated Date - Jul 11 , 2024 | 11:56 PM