Share News

మబగాం నుంచి మంత్రులు

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:36 AM

మూడు దశాబ్దాలుగా మబగాం గ్రామం రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తోంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇక్కడి నుంచే ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ గ్రామస్థులకు మంత్రి వర్గంలో కీలక పదవులతోపాటు డిప్యూటీ సీఎం స్థాయి పదవులు సైతం వరించాయి. ఈ గ్రామానికి చెందిన ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్‌ తరపున గెలుపొంది మూడుశాఖలకు మంత్రిగా సుదీర్ఘకాలం పాటు పలువురు ముఖ్యమంత్రుల కాలంలో వ్యవహరించారు. 1989 నుంచి 99 వరకూ మూడు సార్లు ధర్మాన ప్రసాదరవు బగ్గు లక్ష్మణరావుపై గెలుపొందారు. 1999లో లక్షణరావుపై ఓటమిచెందారు. ఈ నేపథ్యంలో 2004లో శ్రీకాకుళం నుంచి ప్రసాదరావు పోటీచేశారు. ఆ ఎన్నికల్లో అదే గ్రామానికి చెందిన ప్రసాదరావు సోదరుడు కృష్ణదాసు పోటీచేసి గెలుపొందారు. 2014లో అదే గ్రామానికి చెందిన బగ్గు రమణమూర్తిపై ఓటమిపాలయ్యారు. 2019లో జరిగిన ఎన్నికల్లో కృష్ణదాసు గెలుపొంది జగన్‌ క్యాబినెట్‌లో ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఒకే గ్రామానికి చెందిన కృష్ణదాసు, రమణమూర్తి పోటీపడుతున్నారు.

మబగాం నుంచి మంత్రులు
మబగాం గ్రామం:

పోలాకి: మూడు దశాబ్దాలుగా మబగాం గ్రామం రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తోంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇక్కడి నుంచే ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ గ్రామస్థులకు మంత్రి వర్గంలో కీలక పదవులతోపాటు డిప్యూటీ సీఎం స్థాయి పదవులు సైతం వరించాయి. ఈ గ్రామానికి చెందిన ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్‌ తరపున గెలుపొంది మూడుశాఖలకు మంత్రిగా సుదీర్ఘకాలం పాటు పలువురు ముఖ్యమంత్రుల కాలంలో వ్యవహరించారు. 1989 నుంచి 99 వరకూ మూడు సార్లు ధర్మాన ప్రసాదరవు బగ్గు లక్ష్మణరావుపై గెలుపొందారు. 1999లో లక్షణరావుపై ఓటమిచెందారు. ఈ నేపథ్యంలో 2004లో శ్రీకాకుళం నుంచి ప్రసాదరావు పోటీచేశారు. ఆ ఎన్నికల్లో అదే గ్రామానికి చెందిన ప్రసాదరావు సోదరుడు కృష్ణదాసు పోటీచేసి గెలుపొందారు. 2014లో అదే గ్రామానికి చెందిన బగ్గు రమణమూర్తిపై ఓటమిపాలయ్యారు. 2019లో జరిగిన ఎన్నికల్లో కృష్ణదాసు గెలుపొంది జగన్‌ క్యాబినెట్‌లో ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఒకే గ్రామానికి చెందిన కృష్ణదాసు, రమణమూర్తి పోటీపడుతున్నారు.

Updated Date - Apr 25 , 2024 | 12:36 AM