Share News

వలస ఓటర్లు తిరుగుముఖం

ABN , Publish Date - May 14 , 2024 | 11:40 PM

ఇతర ప్రాంతాల్లో ఉద్యోగ, ఉపాధి నిమిత్తం వెళ్లిన వారంతా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓట్లు వేసేందుకు గడచిన నాలుగు రోజులుగా స్వగ్రామాలకు వచ్చిన వారంతా సోమవారం ఓట్ల పండుగ పూర్తి కావడంతో మంగళవారం తిరుగుముఖం పట్టారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఇతర రాష్ట్రాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కూలీలు ఓట్లు వేసి రైళ్లు, బస్సులు, ఇతర వాహనాల్లో పయనమయ్యారు.

వలస ఓటర్లు తిరుగుముఖం
పలాస రూరల్‌: పలాస-విశాఖ పాసింజర్‌లో వెళుతున్న వలస ఓటర్లు

స్వగ్రామాల్లో ఓట్లు వేసి పయనం

రైళ్లు, బస్సులు, ఇతర వాహనాల్లో పట్టణాలకు..

నందిగాం/పలాస రూరల్‌/పోలాకి: ఇతర ప్రాంతాల్లో ఉద్యోగ, ఉపాధి నిమిత్తం వెళ్లిన వారంతా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓట్లు వేసేందుకు గడచిన నాలుగు రోజులుగా స్వగ్రామాలకు వచ్చిన వారంతా సోమవారం ఓట్ల పండుగ పూర్తి కావడంతో మంగళవారం తిరుగుముఖం పట్టారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఇతర రాష్ట్రాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కూలీలు ఓట్లు వేసి రైళ్లు, బస్సులు, ఇతర వాహనాల్లో పయనమయ్యారు. తెలంగాణా, కాండ్లా, పారాదీప్‌, ముంబై, గుజరాత్‌, బెంగుళూరు, గోవా, హైదరాబాద్‌, విశాఖ పట్నం, తిరుపతి, రాయపూర్‌, నాగ్‌పూర్‌, విజయనగరం, తమిళనాడు, నెల్లూరు, విజయవాడ తదితర పట్టణాలకు వెళ్లారు. వారంతా ఒక్కసారి రైళ్లలో పయనిం చేందుకు వెళ్లడంతో రైళ్లు కిటకిట లాడాయి. రైలు ద్వారా వెళ్లాల్సిన వారికి సరైన రిజర్వేషన్‌ లేకపోవడం, ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తే అధిక ధరలు తీసుకుంటుం డడంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు. సరైన సమయానికి వచ్చి ఓట్లు వేశామని సంతృప్తిని వ్యక్తం చేస్తూనే తిరుగు ప్రయాణానికి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని పలువురు పేర్కొంటున్నారు. నందిగాం మండలం దిమ్మిడిజోల, దీనబంధు పురం, అన్నాపురం, మదనాపురం, నౌగాం, కర్లపూడి తదితర గ్రామాలకు చెందిన వలస ఓటర్లు ఓటు వేసేందుకు ప్రత్యేక బస్సుల్లో వచ్చి ఓటు వేసి తిరిగి అవే బస్సుల్లో బయలు దేరారు. వలస ఓటర్లపై ప్రధాన పార్టీలు దృష్టి సారించడంతో వారంతా ఉత్సాహంగా వచ్చారు. ఇదిలా ఉండగా ఎన్నడూ లేనివిధంగా వలస ఓట ర్లు అధిక సంఖ్యలో వచ్చి ఓటు వేయడంతో ఎవరికి మద్దతిచ్చారన్న విషయమై గ్రామాల్లో చర్చించు కుంటున్నారు.

Updated Date - May 14 , 2024 | 11:40 PM