Share News

సమావేశాలకు తప్పని సరిగా హాజరు కావాలి

ABN , Publish Date - Jul 28 , 2024 | 11:25 PM

మూడు నెలలకు ఒకసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశానికి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఎమ్మెల్యే మామిడి గోవింద రావు అన్నారు.

సమావేశాలకు తప్పని సరిగా హాజరు కావాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు

హిరమండలం: మూడు నెలలకు ఒకసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశానికి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఎమ్మెల్యే మామిడి గోవింద రావు అన్నారు. ఆదివారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ తూలుగు మేనక అధ్యక్షతన మండల సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలోని సమస్యలు పరిష్కారం కావాలంటే క్షేత్రస్థాయి సిబ్బంది, అధికారులు సమావేశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో స్వరూపరాణికి సూచించారు. వివిధ సమస్యలను సర్పంచ్‌లు సమావేశం దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. నూతనంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన మామిడి గోవిందరావును మండల పరిషత్‌ అధికారులు, ప్రజాప్రతి నిధులు సత్కరించి అభినందించారు.
సమస్యలు పరిష్కరించాలి..
హిరమండలంలోని చిన్నకోరాడవీధిలో గత కొన్నేళ్లుగా నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పలువురు యువకులు ఎమ్మెల్యే గోవిందరావుకు వినతిపత్రం అందిం చారు. గ్రామదేవత ఆల యానికి విద్యుత్‌ సౌకర్యం, శ్మశాన వాటికకు సీసీ రహదారి, కాలువల నిర్మాణానికి కృషి చేయా లని నందిగాం సాయికృష్ణ పట్నాయక్‌, వార్డు సభ్యుడు వి. సింహాచలం తదితరులు కోరారు.

Updated Date - Jul 28 , 2024 | 11:25 PM