శివసాగర్ బీచ్ అభివృద్ధికి చర్యలు
ABN , Publish Date - Mar 06 , 2024 | 11:44 PM
మండలంలోని శివసాగర్ బీచ్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడు తున్నట్లు పర్యాటకశాఖ డివిజనల్ మేనేజర్ హరిత తెలిపారు. బుధవారం బీచ్‌ను ఆమె సందర్శించారు.

వజ్రపుకొత్తూరు: మండలంలోని శివసాగర్ బీచ్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడు తున్నట్లు పర్యాటకశాఖ డివిజనల్ మేనేజర్ హరిత తెలిపారు. బుధవారం బీచ్‌ను ఆమె సందర్శించారు. ఇప్పటికే సేకరించిన ఐదు ఎకరాల్లో ప్రైవేట్ భాగస్వామ్యంతో అనేక నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకున్నామని, టెండర్ ప్రక్రియ పూర్తయిందన్నారు. పర్యాటకులకు అనువైన విధంగా నిర్మాణాలు ఉంటాయన్నారు. రెస్టారెంట్, విశ్రాంతి భవనాలు, మరుగుదొడ్ల నిర్మాణాలు చేపడతామన్నారు. ఈ భూములు సీఆర్ జెడ్ పరిధిలో ఉన్నప్పటికీ కొంతమంది రైతులు ఆక్రమించారని, వాటిని స్వాధీనం చేసుకోవాలని ఇప్పటికే రెవెన్యూ, పోలీసు అధికారులను కోరామన్నారు. కార్యక్రమంలో పర్యాటక మేనేజర్ నారాయణరావు, ఎస్‌ఐ రామారావు, ఆర్‌ఐ పవిత్ర, సర్వేయర్ తిరుపతిరావు, మాజీ సర్పంచ్ లండ రామలింగం తదితరులు పాల్గొన్నారు.