Share News

విద్యుదాఘాతంతో తాపీమేస్త్రీ మృతి

ABN , Publish Date - Mar 27 , 2024 | 12:21 AM

మందస మండలం సువ ర్ణాపురం పంచాయతీ చిన్న సువర్ణాపురం (ఉగ్రవానిపేట)లో మంగళవారం విద్యుదాఘా తానికి గురై తాపీమేస్ట్రీ సాలిన గున్నయ్య(40) మృతిచెందాడు.

విద్యుదాఘాతంతో తాపీమేస్త్రీ మృతి

హరిపురం: మందస మండలం సువ ర్ణాపురం పంచాయతీ చిన్న సువర్ణాపురం (ఉగ్రవానిపేట)లో మంగళవారం విద్యుదాఘా తానికి గురై తాపీమేస్ట్రీ సాలిన గున్నయ్య(40) మృతిచెందాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. పలాస మం డలం గొల్లమాకన్నపల్లి గ్రామానికి చెందిన గున్నయ్య అత్తవారి గ్రామమైన బహాడపల్లిలో స్థిరపడ్డాడు. తాపీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఉగ్రవానిపేటలో ఇంటి నిర్మాణం పనిచేస్తున్నాడు. స్లాబ్‌ వేసేందుకు గజాలను సిద్ధం చేస్తుండగా ఇంటి పైనుంచి వెళ్తున్న 11 కేవీ విద్యుత్తు తీగలకు ఇనుపగజం తగలడంతో వెంటనే అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికులు గమనించి 108 వాహనంలో పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఘటనపై మందస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అనుమానాస్పద స్థితిలో ఒకరు..

హరిపురం: మందస మండల కేంద్రంలోని రాజుకోట ఆవరణలో సాహు సింహాచలం(38) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మంగళవారం మృతి చెందాడు. మృతుడికి కుటుంబ సభ్యులెవరూ లేకపోవటంతో చెత్త ఏరుకొని, పబ్లిక్‌ మరుగు దొడ్లు శుభ్రం చేసుకుంటూ వచ్చే డబ్బులతో జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసవడం, సరైన ఆహారం లేక అనారోగ్యానికి గురై మృతిచెందినట్టుగా స్థానికులు భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని ఎస్‌ఐ అనిల్‌కుమార్‌ పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Updated Date - Mar 27 , 2024 | 12:21 AM