Share News

వివాహిత ఆత్మహత్యాయత్నం

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:05 AM

పట్టణంలో మారుతీనగర్‌-2లో ఉంటున్న సెక్యూరిటీ గార్డు అరుణ్‌కుమార్‌ భార్య మీనాకుమారి గురువారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

వివాహిత ఆత్మహత్యాయత్నం

నరసన్నపేట: పట్టణంలో మారుతీనగర్‌-2లో ఉంటున్న సెక్యూరిటీ గార్డు అరుణ్‌కుమార్‌ భార్య మీనాకుమారి గురువారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు, 108 వాహన సిబ్బంది తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. పాతపట్నం మండలం కొరసవాడకు చెందిన మీనా కుమారి తన భర్తతో కలిసి మారుతీనగర్‌-2లో ఉంటున్నారు. గత కొన్నాళ్లుగా ఇద్దరి మధ్య మనస్పర్థలతో కలత చెందిన మీనా కుమారి పాయిజన్‌ తీసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న 108 వాహన సిబ్బంది ఆమెను నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించినట్లు 108 వాహన సిబ్బంది తెలిపారు. ఈ ఘటనపై ఏఎస్‌ఐ అసిరినాయుడు వద్ద ప్రస్తావించగా ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 12:05 AM