road accident రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
ABN , Publish Date - Dec 28 , 2024 | 11:38 PM
road accident మొగిలిపాడు దాబా వద్ద హైవేపై శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.

పలాస, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): మొగిలిపాడు దాబా వద్ద హైవేపై శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఇచ్చా ఫురం వైపు వెళ్తున్న ద్విచక్రవాహనదారుడు ఆగి ఉన్న లారీని ఢీ కొనడంతో అత డికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడు ఒడిశా రాష్ట్రం సుర్లా గ్రామానికి చెందిన కృష్ణారావుగా గుర్తించారు. వెంటనే అతడిని 108లో పలాన ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. తల, కాలు, చేతిపై తీవ్ర గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఆవు అడ్డు రావడంతో..
టెక్కలి, డిసెంబరు 28(ఆంరఽధజ్యోతి): రావివలస కూడలి సమీపంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో సారవకోట మండలం కిన్నెరవలసకి చెంది న కె.జగన్నాథం గాయపడ్డాడు. ద్విచక్ర వాహనంపై టెక్కలి నుంచి వస్తుండగా ఆవు అడ్డంగా రావడంతో బైక్ బోల్తా పడింది. దీంతో ఆయన తీవ్రంగా గాయ పడ్డాడు. వెంటనే క్షతగాత్రుడిని స్థానికులు జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిఫర్ చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రైలు నుంచి జారిపడి మహిళకు..
టెక్కలి, డిసెంబరు 28 (ఆంధ్ర జ్యోతి): సింగుమహంతిపేట గ్రామా నికి చెందిన కె.తులసి శనివారం మధ్యాహ్నం నౌపడా రైల్వే జంక్షన్‌లో నౌపడా నుంచి విశాఖ వైపు వెళ్తున్న విశాఖ ఎక్స్‌ప్రెస్ ఎక్కుతూ ప్రమాదవ శాత్తు జారిపడి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనంలో టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు తులసికి వైద్యులు వైద్యసేవలు అందిస్తున్నారు.