మహా ధర్నాను జయప్రదం చేయండి
ABN , Publish Date - Mar 06 , 2024 | 11:41 PM
కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద మార్చి 11న జరుగు మహా ధర్నాను జయప్రదం చేయాలని రైతు సంఘాల నాయకులు కోనారి మోహన్‌రావు, అజయ్‌కుమార్, వేణుగోపాల్, రామారావు కోరారు. బుధవారం కాశీబుగ్గలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో వామపక్ష నాయకులు, రైతు సంఘాల జీడి రైతుల సమన్వయ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు.

కాశీబుగ్గ: కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద మార్చి 11న జరుగు మహా ధర్నాను జయప్రదం చేయాలని రైతు సంఘాల నాయకులు కోనారి మోహన్‌రావు, అజయ్‌కుమార్, వేణుగోపాల్, రామారావు కోరారు. బుధవారం కాశీబుగ్గలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో వామపక్ష నాయకులు, రైతు సంఘాల జీడి రైతుల సమన్వయ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా కరపత్రాలు విడుదల చేశారు. వారు మాట్లాడుతూ.. ఉద్దాన ప్రాంతంలో జీడి పిక్కలు 80 కేజీలు బస్తాకు రూ.16 వేలు మద్దతు ధర ప్రకటించి, ఆర్బీకేల ద్వారా ప్రభుత్వమే కొను గోలు చేయాలని వైసీపీ ప్రభుత్వానికి కోరినా కనీసం స్పందించిన దాఖలాలు లేవని, రైతులు మాత్రం అనేక ఏళ్లుగా ఉద్యమాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 11న నిర్వహిస్తున్న మహా ధర్నాలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో వామ పక్ష నాయకులు మాధవరావు, గురయ్య, కాంతారావు, గణపతి, పురుషొత్తం, హేమాచలం, రాజారావు, తవిటయ్య తదితరులు పాల్గొన్నారు.