Share News

‘శంఖారావం’ విజయవంతం చేయండి

ABN , Publish Date - Feb 12 , 2024 | 12:41 AM

టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ జిల్లాలో చేపట్టిన శంఖారావం విజయవంతం చేయాలని ఆ పార్టీ నాయకులు కోరారు. ఆదివారం ఆమదాలవలస, లావేరులో జరిగే సభల ఏర్పాట్లను నాయకులు పరిశీలించారు.

‘శంఖారావం’ విజయవంతం చేయండి
లావేరు: శంఖారావం సభాప్రాంగణాన్ని పరిశీలిస్తున్న కళావెంకటరావు

టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ జిల్లాలో చేపట్టిన శంఖారావం విజయవంతం చేయాలని ఆ పార్టీ నాయకులు కోరారు. ఆదివారం ఆమదాలవలస, లావేరులో జరిగే సభల ఏర్పాట్లను నాయకులు పరిశీలించారు.

జగన్‌కు ఓటమి భయం: కళా

లావేరు: సీఎం జగన్‌కు ఓటమి భయంపట్టుకుందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకటరావు తెలిపారు. చంద్రబాబు నాయుడు సీఎం కావడం ఒక చారిత్రక అవసరమని చెప్పా రు. లావేరు లో ఈనెల 15న జరిగే టీడీపీ జాతీయ టీడీపీ ప్రధాన కార్య దర్శి నారా లోకేశ్‌ నిర్వహించే శంఖారావం సభా ప్రాంగణాన్ని ఆదివారం కళా వెంకటరావు పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లా డుతూ.. లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్రతో జగన్‌కు పతనం ప్రారంభమైందన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు గెలుపే ధ్యేయంగా పని చేయాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు ముప్పిడి సురేష్‌, ఏఎంసీ మాజీ చైర్మన్‌ ఐ.తోటయ్యదొర టీడీపీ నాయకులు లంకలపల్లి శ్రీనివాసరావు, కోరాడ వెంకటరావు, మాకన మల్లేష్‌, లంక శ్యామలరావు, గొర్లె విజయ్‌ కుమార్‌, పిన్నింటి భానోజీరావు, ముక్కు ఆదినారాయణ పాల్గొన్నారు.

శంఖారావం యాత్రకు ముమ్మర ఏర్పాట్లు

నరసన్నపేట: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన శంఖారావం యాత్రకు జమ్ము జంక్షన్‌ వద్ద సభా నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. నరసన్నపేట, పోలాకి, జలుమూరు, సారవకోట మండలాల నుంచి సుమారు 20 వేల మంది క్రియాశీలక కార్యకర్తలు, నాయకులు, కేడర్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం ఉదయం 9 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకోవాలని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోరారు. ఈ మేరకు నేతలు ఆదివారం గ్రామాల్లో విస్తృ తంగా ప్రచారం చేశారు. శంఖారావం సందర్భంగా అంతా పసుపుమ యమైంది.

స్థల పరిశీలన

పాతపట్నం: పాతపట్నంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టనున్న శంఖారావం యాత్ర బహిరంగ సభ ఏర్పాట్లను మాజీఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జి కలమట వెంకట రమణమూర్తి ఆదివారం పరిశీలించారు. స్థానిక పెట్రోల్‌ బంక్‌ ఎదురుగా ఉన్న శ్రీనివాస రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లో ఈ సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోకేశ్‌ మంగళవారం పాతపట్నంలో శంఖారావం కార్యక్రమం చేపట్టనున్నారని, పెద్ద ఎత్తున పాల్గొని విజయ వంతం చేయాలని కోరారు. ఆయన వెంట పార్టీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్‌ నాయకులు పాల్గొన్నారు.

ఆమదాలవలసలో..

సరుబుజ్జిలి: ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదా నంలో సోమవారం మధ్యాహ్నం నిర్వహించనున్న లోకేశ్‌ బహిరంగ సభ వేదికను ఆదివారం టీడీపీ నాయకులు తమ్మినేని విద్యాసాగర్‌, సనపల ఢిల్లీశ్వరరావు పరిశీలించారు. వేదికతో పాటు సమావేశానికి హాజరు కాను న్న శ్రేణులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటుచేశారు.

తరలిరండి

పొందూరు: వైసీపీ ప్రభుత్వ అక్రమాలపై లోకేశ్‌ తలపెట్టిని తల పెట్టిన పోరులో భాగంగా సోమవారం ఆమదాలవలసలో నిర్వహిం చనున్న శంఖారావం సభకు తరలిరావాలని టీడీపీ మండలాధ్యక్షుడు సీహెచ్‌ రామ్మోహన్‌, ఏఎంసీ మాజీ చైర్మన్‌ అన్నెపు రాము, తెలుగు యువత జిల్లా ప్రధానకార్యదర్శి బలగ శంకర భాస్కర్‌, పార్టీ పట్టణా ధ్యక్షుడు ఎ.చినరంగ కోరారు. ఆదివారం పొందూరులో విలేకరులతో మా ట్లాడుతూ ఆమదాలవలసలో జరిగే సభకు ప్రతి గ్రామం నుంచి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రావాలని కోరారు.

Updated Date - Feb 12 , 2024 | 12:41 AM