‘చలో అసెంబ్లీ’ విజయవంతం చేయండి
ABN , Publish Date - Feb 03 , 2024 | 12:17 AM
ఈ నెల 6వ తేదీన నిర్వహించనున్న సర్పంచ్‌ల ‘చలో అసెంబ్లీ’ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉమ్మడి జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు గొండు శంకర్ పిలుపునిచ్చారు.
- సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు గొండు శంకర్
అరసవల్లి: ఈ నెల 6వ తేదీన నిర్వహించనున్న సర్పంచ్‌ల ‘చలో అసెంబ్లీ’ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉమ్మడి జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు గొండు శంకర్ పిలుపునిచ్చారు. శుక్రవారం తన కార్యాల యంలో ఆయన విలేకరుతో మాట్లాడుతూ.. సర్పంచ్‌ల హక్కులను కాలరాచి, పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిన ప్రభుత్వ వైఖరికి నిరసనగా, సమస్యల పరిష్కారానికై సర్పంచ్‌లందరూ పార్టీలకతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాలని కోరారు. రాష్ట్రంలోని 12,918 గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం 14, 15 ఆర్థిక సంఘం ద్వారా ఇచ్చిన రూ.8,629 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కాజేసిందని, ఆ నిధులను తక్షణమే సర్పంచ్‌ల ఖాతాల్లో జమ చేయాలని, సర్పంచులకు, ఎంపీటీసీలకు గౌరవవేతనం పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు కొంక్యాన ఆదినారాయణ పాల్గొన్నారు.