Share News

జీడి పిక్కలకు గిట్టుబాటు ధర కల్పించండి

ABN , Publish Date - Apr 16 , 2024 | 11:31 PM

టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత జీడి పిక్కలకు మద్దతు ధర ప్రకటించి, కొను గోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రిని రైతాంగ సమస్యల సాధన కమిటీ సభ్యులు, మెట్టూరు ఎంపిటిసి కొండ సురేఖ తదితరులు వేర్వేరుగా కోరారు.

జీడి పిక్కలకు గిట్టుబాటు ధర కల్పించండి
చంద్రబాబుకు వినతిపత్రం ఇస్తున్న తెలగ సంఘ నేత పీవీ రామారావు

పలాసరూరల్‌/వజ్రపు కొత్తూరు: టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత జీడి పిక్కలకు మద్దతు ధర ప్రకటించి, కొను గోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రిని రైతాంగ సమస్యల సాధన కమిటీ సభ్యులు, మెట్టూరు ఎంపిటిసి కొండ సురేఖ తదితరులు వేర్వేరుగా కోరారు. ఈ మేరకు కాశీబుగ్గ టీడీపీ కార్యాలయంలో చంద్ర బాబును వారు కలిసి వినతిపత్రాలను అందించారు. ఈ సందర్భంగా జీడి రైతులు ఎదుర్కొం టున్న సమస్య లను ఆయన దృష్టికి తీసుకు వచ్చారు. జిల్లాలో 30 మండలాల్లో 44 వేల హెక్టార్లలో జీడి పంటను సాదు చేస్తున్నా మని, ఎకరాకు రూ.25వేల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తోందన్నారు. దీంతో మద్దతు ధర లేకపోవడం, విదేశీ పిక్కలను వ్యాపారులు కొనుగోలు చేస్తుండ డంతో ప్రతిఏటా రైతులు నష్ట పోతున్నారన్నారు. చంద్రబాబును కలిసిన వారిలో గౌతు శిరీష, రైతాంగ సాధ న కమిటీ సభ్యులు మామిడి మాధవరావు, కార్యదర్శి గొర్లె చలపతి, కిక్కర ఢిల్లీరావు, మెట్టూరు మాజీ ఎంపీటీసీ భారతి తదితరులు పాల్గొన్నారు. అలాగే రైతాంగ సాధన కమిటీ సభ్యులు అచ్చెన్నాయుడును కలిసి సమస్యపై వినతిపత్రం ఇచ్చారు.
తెలగ కులస్థులను బీసీ జాబితాలో చేర్చండి
కాశీబుగ్గ: తెలగ కులస్థులు ఆర్థికంగా, రాజకీయంగా, విద్య, ఉపాధి పరంగా వెనుకబడి ఉన్నారని అందువల్ల బీసీ జాబితాలో చేర్చాలని తెలగ రిజర్వేషన్‌ ఉద్యమ నేత పల్లంట్ల వెంకట రామారావు కోరారు. ఈ మేరకు మంగళవారం కాశీబుగ్గలో టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా తెలగ కులస్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. దీనికి చంద్రబాబు స్పంది స్తూ.. పరిశీ లించి తగు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో సంఘ సభ్యులు శ్రీనివాస్‌రావు, సురేష్‌, వెంకటేష్‌, రవి, ఎన్‌.వాసు, భాస్కర రావు తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 11:31 PM