Share News

‘అమృత్‌ భారత్‌’తో రైల్వేస్టేషన్లకు మహర్దశ

ABN , Publish Date - Feb 27 , 2024 | 12:55 AM

అమృత్‌ భారత్‌ పేరిట దేశంలో ఒకేసారి 554 రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేపట్ట డం గిన్నీస్‌ రికార్డు అంశమేనని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు.

‘అమృత్‌ భారత్‌’తో రైల్వేస్టేషన్లకు మహర్దశ
మాట్లాడుతున్న ఎంపీ రామ్మోహన్‌ నాయుడు

- వర్చువల్‌ విధానంలో పీఎం మోదీ శంకుస్థాపనలు

- నిధులు మంజూరు హర్షణీయం: ఎంపీ రామ్మోహన్‌

ఆమదాలవలస/ ఇచ్ఛాపురం, ఫిబ్రవరి 26: అమృత్‌ భారత్‌ పేరిట దేశంలో ఒకేసారి 554 రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేపట్ట డం గిన్నీస్‌ రికార్డు అంశమేనని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు. ఈ పథకం ద్వారా రైల్వేస్టేషన్లకు మహర్దశ పట్టనుందని స్పష్టం చేశారు. సోమవారం శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) రైల్వేస్టేషన్‌లో నిర్వహించిన ప్రధానమంత్రి మోదీ వర్చువల్‌ శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ‘అమృత్‌ భారత్‌ కింద జిల్లాలో మూడు రైల్వేస్టేషన్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం అభినం దనీయం. ఒకప్పుడు రాష్ర్టాల భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వం రైల్వే అభివృద్ధి పనులు చేపట్టేది. ప్రస్తుతం పీఎం మోదీ ఆ విధానానికి స్వస్తి పలికి ఒకేసారి రూ.41వేల కోట్లతో చిరస్థాయిగా నిలిచే అభి వృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. శ్రీకాకుళంరోడ్డు రైల్వేస్టేషన్‌ భవన నిర్మాణంతోపాటు ఊసవానిపేట రైల్వేగేటు వద్ద ఫ్లైఓవర్‌ నిర్మాణానికి సుమారు రూ.25కోట్లు, నౌపడ రైల్వేస్టేషన్‌ అభివృద్ధికి రూ.18కోట్లు మంజూరయ్యాయి’ అని తెలిపారు. ప్రయాణికు లకు మెరుగైన సౌకర్యాలు అందనున్నాయని వెల్లడించారు. అలాగే దూసి సమీపంలో రైల్వే గేటు వద్ద ఫ్లైఓవర్‌ నిర్మాణానికి రూ.70కోట్లు మంజూరయ్యాయి. అక్కడ చీఫ్‌ ఇంజనీర్‌ వి.సాయిరాజ్‌ ఆధ్వర్యంలో వర్చువల్‌ శం కుస్థాపన చేశారు.

- ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌ అభివృద్ధికి రూ.17.98కోట్లు మంజూరు చేయడం శుభ పరిణామమని ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ తెలిపారు. ఇచ్ఛాపురంలో ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ‘ఇచ్ఛాపురం స్టేషన్‌లో ప్రధాన రైళ్లు పూరీ-అహ్మదాబాద్‌, హౌరా- యశ్వంత్‌పూర్‌ నిలుపుదల చేయాలి. రెండు అండర్‌ పాసేజ్‌లు పున రుద్ధరించాలి. ఆటోలు నిలిపేందుకు డ్రైవర్లకు స్థలం కేటాయించాల’ని ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే చీఫ్‌ ఇంజనీర్‌ చంద్రమోహన్‌ను ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిర్లంగి ఉమామహేశ్వరరావు, ఏడీఆర్‌ఎం గుప్తా, వైస్‌ చైర్‌పర్సన్‌ ఉలాల భారతి దివ్య, బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నిర్మలారెడ్డి, కట్టా సూర్యప్రకాష్‌, ఏఈ రస్మిరంజన్‌దాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 27 , 2024 | 12:55 AM