Share News

ముహూర్తం చూడండి

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:08 AM

జిల్లాలో ప్రస్తుతం పొలిటికల్‌ ముహూర్తాల సమ యం నడుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేయడానికి అభ్యర్థులు జ్యోతిష్యులను ఆశ్రయిస్తున్నారు.

 ముహూర్తం చూడండి

ముహూర్తం చూడండి

నరసన్నపేట, ఏప్రిల్‌ 17: జిల్లాలో ప్రస్తుతం పొలిటికల్‌ ముహూర్తాల సమ యం నడుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేయడానికి అభ్యర్థులు జ్యోతిష్యులను ఆశ్రయిస్తున్నారు. పేరు, రాశి బలాల మీద నామినే షన్ల తేదీలను ఖరారు చేస్తున్నారు. రాజకీయ పార్టీల నాయకులకు ఎన్నికల్లో టికెట్‌ దక్కించుకోవడం ఒక ఎత్తైతే.. ఆ తర్వాత విజయం సాఽధించడానికి అంగ, అర్థబలంతోపాటు దేవుని ఆశిస్సులు అవసరమని భావిస్తున్నారు. ఎక్కు వ మంది ముహూర్తం కలిసివస్తే విజయం సాధిస్తామని నమ్ముతున్నారు. దీంతో తమకు తెలిసిన జ్యోతిష్యులు, పండితులను సంప్రదిస్తున్నారు. నామినేషన్ల ఘట్టం గురువారం నుంచి ప్రారంభంకా నుండడంతో పోటీ చేయనున్న అభ్యర్థులు తమ పేరుమీద మంచి ముహూర్తం కోసం పలువురు పండితులను కలిసి ముహూర్తం ఖరారుచేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే దాదాపుగా జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు, లోక్‌సభ సెగ్మెంట్‌కు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల ప్రకటించారు. కొన్ని నియోజకవర్గాల్లో గుర్తింపులేని, రిజిస్టర్‌, చిన్న పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు రంగంలో నిలిచేందుకు సమాయత్తమవుతున్నారు.

పేరు, రాశి బలాలు మీద నామినేషన్లు తేదీల ఖరారు

జిల్లాలో ఈనెల 18న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంకానుంది. ఆరోజు గురువారం కావడం, దశమి కొందరికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు. 19న ఏకాదశి తిధి, నక్షత్రం ముఖ నక్షత్రం, 20న శనివారం ద్వాదశి పుబ్బ నక్షత్రం ఈరోజు నామినేషన్‌ వేసేందుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. 21న సెలవురోజు 22న చతుర్ధశి తిధికాగా, హస్త నక్షత్రం, 23న పౌర్ణమి మంచిదే కానీ మంగళవారం సెంటిమెంట్‌తో ఎక్కువ మంది నామినేషన్‌ వేసేందుకు ముందుకురాకపోయే అవకాశముంది. 24, 25 తేదీలో పాడ్యమి స్వాతి, విశాఖ నక్షత్రాలు కావడంతో ఆరోజు నామినేషన్ల దాఖలకు మంచిదని పండితులు చెబుతున్నారు. తమ పేరు, రాశి బలాలను బట్టి అభ్యర్థులు నామినేషన్‌ తేదీలను నిర్ణయించడానికి వేదపండితులను అభ్యర్థులు ఆశ్రయిస్తున్నారు.

Updated Date - Apr 18 , 2024 | 12:09 AM