Share News

కన్నుల పండువగా లింగోద్భవం

ABN , Publish Date - Mar 09 , 2024 | 12:15 AM

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీముఖలింగేశ్వరాలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత లింగోద్భవ కార్యక్రమం కన్నుల పండువగా నిర్వహించారు. గణపతి పూజ, శాంతిమంత్రం, కలశారాధన, రుద్ర బిల్వార్చన, మహారాజ పట్టాభిషేకం, మంత్రపుష్పం తదితర కార్యక్ర మాలు చేపట్టారు. పర్లాకిమిడి యువరాణి కల్యాణి గజపతి వర్మతో పాటు మహారాజు వంశం తరపున అర్చకుడు శరత్‌ చంద్ర పండా పూజల్లో పాల్గొని స్వామి ని దర్శించుకున్నారు.

 కన్నుల పండువగా లింగోద్భవం
లింగోద్భవ కార్యక్రమంలో పాల్గొన్న పర్లాకిమిడి యువరాణి కల్యాణ గజపతి వర్మ

జలుమూరు: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీముఖలింగేశ్వరాలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత లింగోద్భవ కార్యక్రమం కన్నుల పండువగా నిర్వహించారు. గణపతి పూజ, శాంతిమంత్రం, కలశారాధన, రుద్ర బిల్వార్చన, మహారాజ పట్టాభిషేకం, మంత్రపుష్పం తదితర కార్యక్ర మాలు చేపట్టారు. పర్లాకిమిడి యువరాణి కల్యాణి గజపతి వర్మతో పాటు మహారాజు వంశం తరపున అర్చకుడు శరత్‌ చంద్ర పండా పూజల్లో పాల్గొని స్వామి ని దర్శించుకున్నారు. బంగారు, వెండి పుష్పాలతో పాటు 108కొబ్బరి కాయలతో అభిషేకం చేశారు. అనంతరం లింగం మునిగేవరకు బియ్యం పోసి లింగోద్భవ కార్య క్రమం చేపట్టారు. సంప్రదాయ ప్రకారం శ్రీముఖలింగేశ్వరుని గర్భగుడి శిఖరంపై శిఖర దీపం వెలిగించి పాగా గావంచాను వినాయక విగ్రహం వరకు వేలాడదీసి పూజలు చేశారు. అంతకుముందు గ్రామంలో స్వామి తిరువీధి కన్నుల పండువగా చేపట్టారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సతీష్‌, ఎంపీటీసీ హరిప్రసాద్‌, ఈవో ప్రభాకరరావు, అర్చకులు పాల్గొన్నారు. ఎటు వంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నరసన్నపేట సీఐ బి.ప్రసాదరావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ మధుసూదనరావు గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు.

Updated Date - Mar 09 , 2024 | 12:15 AM