Share News

విజయమే లక్ష్యంగా ముందుకు సాగుదాం

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:02 AM

విజయమే లక్ష్యంగా అందరూ ముందుకు సాగుదామని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌, శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్‌ పిలుపునిచ్చారు. గురువారం రాత్రి స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో నగర డివిజన్‌ ఇన్‌చార్జిలు, రూరల్‌, గార నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.

 విజయమే లక్ష్యంగా ముందుకు సాగుదాం
పొందూరు: కింతలిలో ప్రచారం చేస్తున్న ఎంపీ రామ్మోహన్‌, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌

అరసవల్లి, ఏప్రిల్‌ 18: విజయమే లక్ష్యంగా అందరూ ముందుకు సాగుదామని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌, శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్‌ పిలుపునిచ్చారు. గురువారం రాత్రి స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో నగర డివిజన్‌ ఇన్‌చార్జిలు, రూరల్‌, గార నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అందరూ ఏకతాటిపైకి వచ్చి పార్టీ అఖండ విజయానికి నూతనోత్సాహంతో కృషి చేస్తామన్నారు. గత ఐదేళ్లుగా శ్రీకాకుళం నియోజక వర్గంలో డివిజన్‌ ఇన్‌చార్జిలుగా, ఇతర బాఽధ్యతలు నిర్వర్తిస్తున్న వారంతా ఆయా బాధ్యతల్లోనే కొనసాగుతారని, ఎటువంటి వివాదాలకు ఇక తావులేదని, విజయమే అంతిమ లక్ష్యంగా కృషి చేయాలని నేతలు కోరారు. కార్యక్రమంలో నగర టీడీపీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్‌, నేతలు పీఎంజే బాబు, సింతు సుధాకర్‌, ముద్దాడ కృష్ణమూర్తి నాయుడు, కొమ్మనాపల్లి వెంకట రామరాజు తదితరులు పాల్గొన్నారు.

కింతలి నుంచి 95 వైసీపీ కుటుంబాలు చేరిక

పొందూరు: మండలంలో వైసీపీకి పట్టున్న అతిపెద్ద గ్రామాల్లో ఒకటైన కింతలి నుంచి 95 వైసీపీ కుటుంబాలు ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ లో చేరాయి. సర్పంచ్‌ పైడి రామప్రసాద్‌, ఎంపీటీసీ కూటికుప్పల హనుమంతురావు ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు, అభ్యర్థి కూన రవికుమార్‌ కండువాలు వేసి ఆహ్వానించారు.

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అమలు చేయ నున్న సూపర్‌ సిక్స్‌ పథకాలతో రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ అన్నారు. కింతలి గ్రామం లో గురువారం శంఖారావంలో భాగం గా ఎన్నికల ప్రచారం చేశారు. కార్యక్రమంలో జనసేన ఇన్‌చార్జి పేడాడ రామ్మోహన్‌, టీడీపీ మండల అధ్యక్షుడు సీహెచ్‌ రామ్మోహన్‌, నాయకులు డి.సన్యాసిరావు, డి.గణపతి, కె.సత్యారావు, ఎ.రాము తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 12:02 AM