బాలకార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం
ABN , Publish Date - Jun 12 , 2024 | 11:38 PM
ప్రతీ ఒక్కరూ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చే యాలని రిమ్స్ నర్సింగ్ కళాశాల ప్రొగ్రాం అధికారిణి, లెక్చరర్ కె.పద్మావతి, ఇన్‌చార్జ్జి ప్రిన్సిపాల్ ఎం.మిచెల్ పిలుపునిచ్చారు.
శ్రీకాకుళం అర్బన్: ప్రతీ ఒక్కరూ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చే యాలని రిమ్స్ నర్సింగ్ కళాశాల ప్రొగ్రాం అధికారిణి, లెక్చరర్ కె.పద్మావతి, ఇన్‌చార్జ్జి ప్రిన్సిపాల్ ఎం.మిచెల్ పిలుపునిచ్చారు. నర్సింగ్ కళాశాల ఆవరణలో మంగళవారం ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రొగ్రాం అధికారిణి పద్మావ తి ఆధ్వర్యంలో నర్సింగ్ విద్యార్థినులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులంతా నిబద్దతతో పనిచేద్దాం బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దామంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ఫ్రొఫిసర్ ఉషా పన్నాగవేణి, ఏపీవో పి.సునీత విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.