Share News

లా సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:07 AM

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ దాని అనుబంధ కళాశాలల్లో మూడు, ఐదేళ్ల లా కోర్సులు చ దువుతున్న విద్యార్థుల 2, 5, 9 సెమిస్టర్‌ పరీక్ష ఫలితాల ను విడుదల చేసినట్టు పరీక్షల విభాగం డీన్‌ డాక్టర్‌ ఎస్‌. ఉదయభాస్కర్‌ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

లా సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

ఎచ్చెర్ల: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ దాని అనుబంధ కళాశాలల్లో మూడు, ఐదేళ్ల లా కోర్సులు చ దువుతున్న విద్యార్థుల 2, 5, 9 సెమిస్టర్‌ పరీక్ష ఫలితాల ను విడుదల చేసినట్టు పరీక్షల విభాగం డీన్‌ డాక్టర్‌ ఎస్‌. ఉదయభాస్కర్‌ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మూడేళ్ల లా కోర్సులో రెండో సెమిస్టర్‌లో 88కు 79 మంది, ఐదో సెమిస్టర్‌లో 110కు 109 మంది విద్యార్థులు ఉత్తీర్ణు లయ్యారు. ఐదేళ్ల లా కోర్సులో రెండో సెమిస్టర్‌లో 29కు 26 మంది, ఐదో సెమిస్టర్‌లో 21కు 17 మంది, తొమ్మిదో సెమిస్టర్‌లో 14కు 13 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యార ని చెప్పారు. పరీక్ష ఫలితాల వివరాలను వర్సిటీ వెబ్‌సైట్‌, జ్ఞానభూమి పోర్టల్‌ అందుబాటులో ఉంచామన్నారు.

Updated Date - Mar 29 , 2024 | 12:07 AM