Share News

విద్యుదాఘాతంతో లారీ క్లీనర్‌ మృతి

ABN , Publish Date - Jul 05 , 2024 | 11:55 PM

జడ్యాడ సమీపంలో శుక్రవారం విద్యుదాఘాతానికి గురై లారీ క్లీనర్‌ అత్తిని వెంకటరావు(36) మృతిచెందాడు.

విద్యుదాఘాతంతో లారీ క్లీనర్‌ మృతి

నందిగాం: జడ్యాడ సమీపంలో శుక్రవారం విద్యుదాఘాతానికి గురై లారీ క్లీనర్‌ అత్తిని వెంకటరావు(36) మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కోటబొమ్మాళి మండలం కొత్తపేట తారకరామ కాలనీకి చెందిన వెంకటరావు లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం జడ్యాడ సమీపంలో కాలువ పనులు పూర్తి చేసుకొని ఎక్స్‌కవేటర్‌ను లారీపై ఎక్కించి మెళియాపుట్టి మండలం తీసుకు వెళ్తుండగా మార్గమధ్యంలో 11 కేవీ విద్యుత్‌ వైర్లు ఎక్సకవేటర్‌కు తగలడంతో ఆయన షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. వెంకటరావు భార్య జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ మహ్మద్‌ అమీర్‌ ఆలీ.. లారీడ్రైవర్‌ డి.రాముపై కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. వెంకటరావుకి భార్యతో పాటు కుమారుడు ఉన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 11:55 PM