ప్రభుత్వ ఆశయానికి తూట్లు
ABN , Publish Date - Dec 27 , 2024 | 12:26 AM
Lack of supervision in 'Palle Pandaga' works పల్లెల స్వరూపమే మార్చాలని కూటమి ప్రభుత్వం భావి స్తోంది. ఇందుకుగాను ‘పల్లె పండుగ’ పేరుతో భారీగా అభివృద్ధి పనులు చేపడుతోంది. గ్రా మంలో రహదారులు, కాలువలను అభి వృద్ధి చేస్తోంది.
‘పల్లెపండగ’ పనుల్లో పర్యవేక్షణ కరువు
ఇష్టారాజ్యంగా నిర్మాణాలు
రణస్థలం, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): పల్లెల స్వరూపమే మార్చాలని కూటమి ప్రభుత్వం భావి స్తోంది. ఇందుకుగాను ‘పల్లె పండుగ’ పేరుతో భారీగా అభివృద్ధి పనులు చేపడుతోంది. గ్రా మంలో రహదారులు, కాలువలను అభి వృద్ధి చేస్తోంది. ఇందుకుగాను భారీగా నిధులు ఖర్చుపెడుతోంది. సంక్రాంతి నా టికి గ్రామీణ ప్రజల కళ్లల్లో ఆనందం నింపాలని భావిస్తోంది. అయితే కొందరు అధికారులు, సిబ్బంది పుణ్యమా అని పను ల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రణస్థలం మండలంలో 34 పంచాయతీల పరిధిలో 111కు పైగా గ్రామాలు ఉన్నాయి. పల్లెపండుగ కార్యక్రమంలో భాగంగా 94 పనులు మంజూరయ్యాయి. ఇందుకుగాను రూ.9.26 కోట్లు నిధులు విడుదల చేశారు. ప్రస్తుతం పనులు చురుగ్గా జరుగుతున్నాయి. జరిగిన పనులకుగాను ప్రతి గురువారం బిల్లుల చెల్లింపులు కూడా చేపడుతున్నారు. 44 సీసీ రోడ్ల పనులు పూర్తిగా 54 సీసీ రోడ్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. సీసీ రోడ్లు వేసినప్పుడు 10 అడుగులు వెడల్పు అయితే ఐదు అంగులాలు ఎం-20 క్వాలిటీ, 12 అడుగులు సీసీ రోడ్డు అయితే ఏడు అంగులాల ఎం-30 నాణ్యత కలిగి ఉండాలి. కానీ పనుల వద్ద ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది లేకపోవడంతో ఇష్టారాజ్యంగా జరుగుతున్నట్టు విమర్శలున్నాయి. 12 అడుగుల వెడల్పుతో రోడ్డు వేయాల్సిన చోట.. 10 అడుగులు వేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. కొన్నిచోట్ల కాలువలు తక్కువ లోతు వేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ పనుల విషయంలో ముగ్గురు ఇంజనీరింగ్ సహాయకులు మేనేజ్ చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై పంచాయ తీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఏఈ అప్పన్న వద్ద ప్రస్తావించగా.. పనులు జరిగినప్పుడు సిబ్బంది ఉండడం సాధ్యం కాద న్నారు. సిబ్బంది కొరత దృష్ట్యా పనులు ప్రారంభించే సమ యంలో ఉంటున్నారని.. ఒకరికి చాలా గ్రామాల బాధ్యత ఉండడంతో సాధ్యం కాదని చెప్పారు.