Share News

Deepotsavam : కోటి దీపోత్సవం

ABN , Publish Date - Dec 29 , 2024 | 11:42 PM

Deepotsavam శ్రీకాకుళంలోని ఎన్టీఆర్‌ మునిసిపల్‌ హైస్కూల్‌ మైదానంలో ఆదివారం రాత్రి కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.

Deepotsavam : కోటి దీపోత్సవం
దీపారాధన చేస్తున్న భక్తులు

శ్రీకాకుళం కల్చరల్‌, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళంలోని ఎన్టీఆర్‌ మునిసిపల్‌ హైస్కూల్‌ మైదానంలో ఆదివారం రాత్రి కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. విజయదుర్గ, విజయగణపతి ఆలయాల ప్రధాన అర్చకులు ఆరవెల్లి సూర్యనారాయణ శర్మ, పెంటా శ్రీధర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. 85 బాక్స్‌ల్లో 350 లింగాలు ఏర్పాటు చేసి.. ఒక్కో ప్రమిదలో 366 ఒత్తులను ఉంచగా భక్తులు దీపాలు వెలిగించారు. ఈ సందర్బంగా పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ.. ప్రవచనామృతం చేశారు. కోటి దీపాలు.. కోటి పుణ్యాల ఫలం అని తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు బాలబాస్కర శర్మ, ఆరవెల్లి శ్రీసీతారామ శర్మ(రాంజీ) అరసవల్లి ఇప్పిలి శంకర శర్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2024 | 11:42 PM