Share News

రాష్ట్ర పండగగా కొత్తమ్మతల్లి జాతర

ABN , Publish Date - Sep 10 , 2024 | 11:59 PM

కొత్తమ్మతల్లి జాతరను రాష్ట్ర పండగగా నిర్వహిం చేందుకు దేవదాయశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్ర పండగగా కొత్తమ్మతల్లి జాతర

-రూ.కోటి మంజూరు చేసిన ప్రభుత్వం

కోటబొమ్మాళి/టెక్కలి: కొత్తమ్మతల్లి జాతరను రాష్ట్ర పండగగా నిర్వహిం చేందుకు దేవదాయశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చొరవతో ఉత్సవాల నిర్వ హణకు కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఉత్సవాలు అక్టోబరు 1 నుంచి 3 వరకు ఘనంగా నిర్వహించనున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా ఒడిశా, ఛత్తీస్‌గడ్‌, జార్ఖండ్‌ వంటి రాష్ర్టాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకోనున్నారు.

హర్షాతిరేకాలు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కొత్తమ్మతల్లి ఉత్సవాన్ని రాష్ట్ర పండ గగా నిర్వహిస్తామని ఎన్నికల సమయంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టుకోవడంతో హర్షా తిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ కొత్తమ్మతల్లి ఉత్సవాలు నామమాత్రంగా జరిగాయి. వైసీపీ నాయకులు వర్గాలుగా విడిపోయి దేవాదాయశాఖ అధికారులు, సిబ్బందిపై దాడులు చేసిన సంఘటనలు సైతం చోటుచేసుకున్నాయి. అయి తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఉత్సవాల నిర్వహణకు కోటి రూపాయలు నిధులు మం జూరు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అమ్మవారి ఆల యానికి రంగులు, బారికేడ్లు, గేట్లు, ఇతర మౌలిక సదుపాయా లు కల్పన, విద్యుద్దీకరణ, మూడురోజుల పాటు సాంస్కృతిక కార్యక్ర మాలు, అన్నదానాలు, పగటివేషాలు, వివిధ రకాల ఆటల పోటీలు వంటివి నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు.

Updated Date - Sep 10 , 2024 | 11:59 PM