Share News

పలాసలో కేంద్రీయ విద్యాలయం

ABN , Publish Date - Jul 09 , 2024 | 11:14 PM

పలాసకు కేంద్రీయ విద్యాలయం మంజూరైంది. ఈ మేరకు విద్యాలయం నిర్మాణానికి సంబంధించి ఆర్డీవో భరత్‌నాయక్‌, డీఈవో కె.వెంకటేశ్వరరావు తదితరులు స్థల పరిశీలన చేశారు.

పలాసలో కేంద్రీయ విద్యాలయం
సూదికొండ వద్ద స్థలాన్ని పరిశీలిస్తున్న ఆర్డీఓ, డీఈవో బృందం

- అధికారుల స్థల పరిశీలన

పలాస, జూలై 9: పలాసకు కేంద్రీయ విద్యాలయం మంజూరైంది. ఈ మేరకు విద్యాలయం నిర్మాణానికి సంబంధించి ఆర్డీవో భరత్‌నాయక్‌, డీఈవో కె.వెంకటేశ్వరరావు తదితరులు స్థల పరిశీలన చేశారు. సూదికొండ తూర్పువైపు భాగంలో ఉన్న స్థలాలను పరిశీలించారు. ఇప్పటికే ఆ స్థలాలు నాయకుల కబ్జాల్లో ఉండగా.. మరికొన్ని స్థలాలు ఎక్సైజ్‌శాఖతోపాటు స్వాతంత్రసమరయోధులు, ఇంకొంతమందికి కేటాయించినట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతంలో కంకర తవ్వకాలకు కూడా గతంలో అనుమతులు ఇచ్చి పర్యావరణ ఇబ్బందులు కారణంగా రద్దు చేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతం చదునుగా ఉండడంతో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు అనువుగా ఉంటుందో లేదో పరిశీలించారు. విద్యాలయానికి మొత్తం 12 ఎకరాలు అవసరం ఉంటుందని డీఈవో తెలిపారు. అంతమేరకు ఇక్కడ స్థలాలు లేకపోవడంతో ఉన్న వాటిని స్వాధీనం చేసుకోవడమో.. లేదా ఇంకో చోట పరిశీలించేలా చర్యలు చేపట్టనున్నారు. ప్రస్తుతం పలాస ప్రాంతంలో ప్రభుత్వ స్థలాల కోసం అధికారులు జల్లెడ పడుతున్నారు. ఇంగిలిగాం ప్రాంతంలో ప్రభుత్వ స్థలాలు ఎక్కువగా ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. అయితే అక్కడ గతంలో ఇళ్ల స్థలాలు, మరే ఇతర అవసరాలకు పట్టాలు ఇచ్చారా? లేదా? అనేది తేలాల్సి ఉంది. అధికారుల వెంట తహసీల్దార్‌ నాయుడు, ఎంఈఓ శ్రీనివాసరావుతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 09 , 2024 | 11:14 PM