Share News

శ్రీముఖలింగంలో కామదహనోత్సవం

ABN , Publish Date - Mar 22 , 2024 | 11:52 PM

దక్షిణకాశీగా ప్రసిద్ధి పొందిన శ్రీముఖలింగంలో శుక్రవారం రాత్రి కామదహనోత్సవం నిర్వహించారు. ఉదయం ముఖలింగేశ్వరునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.

శ్రీముఖలింగంలో కామదహనోత్సవం
శ్రీముఖలింగంలో కామదహనం నిర్వహిస్తున్న అర్చకులు

జలుమూరు: దక్షిణకాశీగా ప్రసిద్ధి పొందిన శ్రీముఖలింగంలో శుక్రవారం రాత్రి కామదహనోత్సవం నిర్వహించారు. ఉదయం ముఖలింగేశ్వరునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. రాత్రి ఉత్సవ మూర్తులను పల్లకిలో వేంచేపు చేసి గ్రామ పురోహితుడు బంకుపల్లి భూషణశర్మ ఆధ్వర్యంలో వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ గ్రామ శివారులోని ఉన్నత పాఠశాల వరకు తిరువీధి నిర్వహించి అక్కడ కామదహనం కార్యక్రమం చేపట్టారు. ప్రతి ఏటా శ్రీకూర్మంలో కామదహనం చేపట్టిన రోజే ఇక్క డా నిర్వహించడం ఆనవాయితీ అని అర్చకులు తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు నారాయణమూర్తి, సింహాచలం, శేషాద్రి వెంకటాచలం, అప్పారావు, శ్రీకృష్ణ, శివ, దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2024 | 11:53 PM