Share News

డిప్లొమో పూర్తిచేసిన వారందరికీ ఉద్యోగాలు

ABN , Publish Date - May 27 , 2024 | 11:58 PM

డిప్లొమో పూర్తిచేసిన వారందరికీ ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్టు రా ష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌ చదలవాడ నాగరాణి అన్నారు.

డిప్లొమో పూర్తిచేసిన వారందరికీ ఉద్యోగాలు
వివిధ కంపెనీలకు ఎంపికైన విద్యార్థులతో కమిషనర్‌ నాగరాణి, ఇతర అధికారులు

- సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నాగరాణి

ఎచ్చెర్ల: డిప్లొమో పూర్తిచేసిన వారందరికీ ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్టు రా ష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌ చదలవాడ నాగరాణి అన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల (శ్రీకాకుళం)లో ఉద్యోగ విజయోత్సవం పేరిట ఉద్యోగాలు పొందిన విద్యార్థులు, తల్లిదండ్రులతో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 84 ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహించి 12 వేల మంది విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగాలు పొందారని చెప్పారు. ఈ కళాశాల నుంచి 211 మంది విద్యార్థులు క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో ఎంపిక కావడం అభినందనీ యమన్నారు. టెక్సాస్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, జేఈ ఎయిరో స్పేస్‌, వీల్స్‌ ఇండియా తదితర బహుళ జాతి కంపెనీలు ఉన్నట్టు తెలిపారు. ఇంజనీరింగ్‌ విద్యార్థులతో సమానంగా డిప్లమో విద్యార్థులు రూ.8 లక్షల వార్షిక వేతనానికి కూడా ఎంపికయ్యారని చెప్పారు. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరో వైపు చదువు కూడా కొనసాగించేలా ప్లాన్‌ చేసుకోవాలన్నారు. సాంకేతిక విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రామకృష్ణ, కళాశాల ప్రిన్సిపాల్‌, జాయింట్‌ కార్యదర్శి బి.జానకిరామయ్య, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ జి.దామోదరరావు, టీపీవో పి.యుగంధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 27 , 2024 | 11:58 PM