Share News

విద్యార్థులకు ఉద్యోగ నైపుణ్య శిక్షణ: వీసీ

ABN , Publish Date - Feb 01 , 2024 | 11:50 PM

డాక్టర్‌ బీఆర్‌అంబేడ్కర్‌ వర్సిటీలో చదువుతున్న పీజీ, ఇంజి నీరింగ్‌ విద్యార్థులు ఉద్యోగాల ఎంపికకు నైపుణ్యం పొందేలా శిక్షణ ఇవ్వ నున్నట్లు వీసీ ప్రొఫెసర్‌ కేఆర్‌ రజని తెలిపారు. గురువారం వర్సిటీలో ముంబైకు చెందిన సెంటర్‌ ఫర్‌ టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌ కన్సెల్టెన్సీ సంస్థ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా సీటీఎంసీ ప్రతి నిధి చంద్రకాంత్‌వర్మ తమసంస్థ ద్వారా సాప్ట్‌స్కిల్స్‌, డిజిటల్‌ మార్కెటిం గ్‌, ఇంటీరియల్‌ డిజైనింగ్‌, వెబ్‌ డిజైనింగ్‌, ఈ-కామర్స్‌, బిజినెస్‌ ఎనలె టిక్స్‌ డేటాసైన్స్‌లో శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. ఐటీ రంగంలో విద్యా ర్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు విశాఖఐటీ సెజ్‌లోని సన్‌రైజ్‌ ఇంక్యుబేషన్‌ హబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని వీసీ పేర్కొ న్నారు. కాగా వర్సిటీలో రూ.35 కోట్లతో నిర్మిస్తున్న పరిపాలన భవనాన్ని వీసీ పరిశీలించారు. ఆమె వెంట రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ బిడ్డిక అడ్డయ్య, ఇంజనీర్‌ అంజిత్‌కుమార్‌ ఉన్నారు.

విద్యార్థులకు ఉద్యోగ నైపుణ్య శిక్షణ: వీసీ

ఎచ్చెర్ల:డాక్టర్‌ బీఆర్‌అంబేడ్కర్‌ వర్సిటీలో చదువుతున్న పీజీ, ఇంజి నీరింగ్‌ విద్యార్థులు ఉద్యోగాల ఎంపికకు నైపుణ్యం పొందేలా శిక్షణ ఇవ్వ నున్నట్లు వీసీ ప్రొఫెసర్‌ కేఆర్‌ రజని తెలిపారు. గురువారం వర్సిటీలో ముంబైకు చెందిన సెంటర్‌ ఫర్‌ టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌ కన్సెల్టెన్సీ సంస్థ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా సీటీఎంసీ ప్రతి నిధి చంద్రకాంత్‌వర్మ తమసంస్థ ద్వారా సాప్ట్‌స్కిల్స్‌, డిజిటల్‌ మార్కెటిం గ్‌, ఇంటీరియల్‌ డిజైనింగ్‌, వెబ్‌ డిజైనింగ్‌, ఈ-కామర్స్‌, బిజినెస్‌ ఎనలె టిక్స్‌ డేటాసైన్స్‌లో శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. ఐటీ రంగంలో విద్యా ర్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు విశాఖఐటీ సెజ్‌లోని సన్‌రైజ్‌ ఇంక్యుబేషన్‌ హబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని వీసీ పేర్కొ న్నారు. కాగా వర్సిటీలో రూ.35 కోట్లతో నిర్మిస్తున్న పరిపాలన భవనాన్ని వీసీ పరిశీలించారు. ఆమె వెంట రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ బిడ్డిక అడ్డయ్య, ఇంజనీర్‌ అంజిత్‌కుమార్‌ ఉన్నారు.

Updated Date - Feb 01 , 2024 | 11:50 PM