Share News

24న జాబ్‌మేళా

ABN , Publish Date - May 21 , 2024 | 12:01 AM

మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 24వ తేదీన జాబ్‌ మేళా నిర్వహించనున్నట్టు ప్రిన్సిపాల్‌, జిల్లా కన్వీనర్‌ ఎల్‌.సుధాకరరావు తెలిపారు.

24న జాబ్‌మేళా

ఎచ్చెర్ల: మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 24వ తేదీన జాబ్‌ మేళా నిర్వహించనున్నట్టు ప్రిన్సిపాల్‌, జిల్లా కన్వీనర్‌ ఎల్‌.సుధాకరరావు తెలిపారు. ఐటీఐ ఉత్తీర్ణులై, 18-35 ఏళ్ల వయసు గల అభ్యర్థులు జాబ్‌మేళాలో పాల్గొనేందుకు అర్హులన్నారు. ఆల్‌స్ట్రామ్‌ (నెల్లూరు), ఐసుజు మోటార్స్‌ లిమిటెడ్‌ (నెల్లూరు), హుందాయ్‌ మోబిస్‌ (అనంతపురం), ఏసీటీ (అనంతపురం), డిక్షాన్‌ (తిరుపతి), కిమ్ల్‌ (అనంతపురం), కేఎస్‌హెచ్‌ (అనంతపురం), ఇన్‌ఫిల్‌లూమ్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ (నెల్లూరు), డీఎస్సీ (అనంతపురం), సియోయాన్‌ హెచ్‌డబ్ల్యూఏ సమ్మిట్‌ (అనంతపురం), సంగ్‌హూ (అనంతపురం), డికో (నెల్లూరు), ఏసియాన్‌ ఆటో పార్ట్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ (నెల్లూరు) సంస్థల్లోని 550 ఉద్యోగాల భర్తీకి జాబ్‌ మేళా నిర్వహిస్తున్నామన్నారు. పదో తరగతి, ఐటీఐ, కుల ధ్రువీకరణ ఒరిజనల్‌ పత్రాలు, ఆధార్‌ కార్డుతో పాటు బయోడేటా, జెరాక్స్‌ కాపీలు రెండు సెట్‌లు, పాస్ట్‌పోర్ట్‌ సైజు ఫొటోలతో ఆ రోజు ఉదయం 9 గంటలకు హాజరు కావాలన్నారు. ఎంపికైన అభ్యర్తులకు అన్ని అలవెన్స్‌లతో కలిపి రూ.15,000 నుంచి రూ.18,000 వరకు నెలకు జీతం ఉంటుందని చెప్పారు. మరిన్ని వివరాకు 99593 53636, 63040 33963 ఫోన్‌ నెంబర్లలో సంప్రదించాలన్నారు.

Updated Date - May 21 , 2024 | 12:01 AM