జై జగన్నాథ
ABN , Publish Date - Jul 08 , 2024 | 12:15 AM
జిల్లాలో జగన్నాథస్వామి రథయాత్ర ఆదివారం వైభవంగా జరిగింది.

- వైభవంగా రథయాత్ర
- భారీగా తరలివచ్చిన భక్తులు
శ్రీకాకుళం కల్చరల్, జూలై 7: జిల్లాలో జగన్నాథస్వామి రథయాత్ర ఆదివారం వైభవంగా జరిగింది. శ్రీకాకుళం, ఇచ్ఛాపురం, జలుమూరు, సోంపేట తదితర మండలాల్లో జగన్నాథ, సుభద్ర, బలభద్రలను రథంపై ఊరేగించారు. జై జగన్నాథ అంటూ స్వామివారి రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. మహిళలు కోలాటం, కృష్ణ భక్తులు భజన, తదితర సాంస్కృతి ప్రదర్శనలు అలరించాయి. సోమవారం నుంచి పది రోజుల పాటు స్వామివారు వివిధ అవతారాల్లో భక్తులకు దర్శనం ఇస్తారని నిర్వాహకులు తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని గుజరాతీపేటలో ఉన్న అతి పురాతనమైన జగన్నాథస్వామి ఆలయంలో పెంట వంశీయులు శ్రీనివాస్ శర్మ, సూర్యనగేష్ శర్మ ఆధ్వర్యంలో రథయాత్రను నిర్వహించారు. అదేవిధంగా బొందిలీపురంలో కూడా రథ యాత్ర జరిగింది. ఉదయం నుంచే జగన్నాథస్వామిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు.