Share News

జగన్‌రెడ్డి.. సానుభూతి ప్రేలాపనలు మానుకో

ABN , Publish Date - Jul 06 , 2024 | 11:51 PM

రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు వైసీపీ కి కోలుకోలేని దెబ్బ కొట్టారని, దీంతో మతిపోయిన జగన్‌రెడ్డి మళ్లీ సానుభూతి ప్రేలాపనలు అందుకున్నాడని ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు.

జగన్‌రెడ్డి.. సానుభూతి ప్రేలాపనలు మానుకో

- ఎమ్మెల్యే కూన రవికుమార్‌

సరుబుజ్జిలి: రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు వైసీపీ కి కోలుకోలేని దెబ్బ కొట్టారని, దీంతో మతిపోయిన జగన్‌రెడ్డి మళ్లీ సానుభూతి ప్రేలాపనలు అందుకున్నాడని ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు. శనివారం మూలసవలాపురంలో పర్యటించిన రవికుమార్‌ విలేకరులతో మాట్లాడారు. అను భవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ సీఎం జగన్‌రెడ్డిని గౌరవించినా విలువలు కోల్పోయి సైకోలా వింత ప్రేలాపనలు పేలుతున్నారన్నారు. తండ్రి, బాబాయ్‌ మరణలతో సానుభూతి నాటకం ఆడి 2019లో అధికార చేపట్టి రాష్ట్రాని సర్వనాశనం చేసిన జగన్‌రెడ్డి వింత ప్రేలాపనలతో కేసులు పెట్టించుకొని ప్రజల సానుభూతి పొందాలనే ఆలోచనలో ఉన్నాడని విమర్శించారు. దేశంలో అధికారం చేపట్టిన 20 రోజుల్లోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఇప్పటికైనా జగన్‌రెడ్టి తన తీరు మార్చుకో కుంటే వైసీపీ అడ్రాస్‌ లేకుండా పోతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ తర్లాడ ఈశ్వరరావు, టీడీపీ నాయకులు శివ్వాల సూర్యనారాయణ, అంబళ్ల రాంబాబు, గురువు తిరుమలరావు, టి.సురేంద్ర, ఎం.అప్పలనాయుడు, జె.పాపారావు, జి.మల్లేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Jul 06 , 2024 | 11:51 PM